టీమిండియా కుర్ర బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వీటికి కిషన్ అదిరిపోయే బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విండీస్ పర్యటనలో తనకు దక్కిన ప్రతి అవకాశాన్నీ కిషన్ యూజ్ చేసుకున్నాడు.
మూడో ఓపెనర్‌గా తనే బెస్ట్ ఆప్షన్ అని నిరూపించుకున్నాడు. మూడు వన్డేల్లో కలిపి 184 పరుగులతో రాణించాడు. ఈ సిరీసులో మూడు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది ప్లేయర్ల జాబితాలో చేరాడు. ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆకాష్ చోప్రాతో కిషన్ ఫన్నీ సంభాషన జరిగింది.

ఈ మ్యాచులో ఒక స్టంపిగ్ కోసం కిషన్ అప్పీల్ చేశాడు. ఇది చూసిన ఆకాష్ చోప్రా వెంటనే దీనిపై సెటైర్ వేశాడు. 'స్టంపింగ్, రనౌట్ నిర్ణయాలను అప్పీల్ చేయడం చాలా అరుదు. నాకైతే బ్యాటర్ కాళ్లు నేలపైనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు రాంచీ నుంచి వస్తుండొచ్చు.. కానీ నీ పేరు ఎంఎస్ ధోనీ కాదు' అని చోప్రా సెటైర్ వేశాడు.
ఇది విన్న కిషన్ నవ్వేస్తూ.. 'అవునా.. అలాగైతే ఓకే' అని అనడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఇది విన్న చోప్రా.. 'నువ్వు చాలా మంచి వాడివి. మాకు నువ్వంటే చాలా ఇష్టం ఇషాన్' అని సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసే అవకాశాన్ని కిషన్ దూరం చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన కాసేపటికే పెవిలియన్ చేరడంపై మాట్లాడాడు.
'నా ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసిన విధానం నాకు ఏమాత్రం నచ్చలేదు. క్రీజులో సెట్ అయిన తర్వాత నేను భారీ స్కోరు చేయాల్సింది. నాకు సీనియర్లు అదే చెప్పారు. నేను క్రీజులోనే ఉండి భారీ స్కోరు చేయాల్సింది. నెక్స్ట్ టైం అదే చేయడానికి ట్రై చేస్తా. కచ్చితంగా క్రీజులో సెటిల్ అయి, భారీ స్కోరు చేస్తా' అని చెప్పాడు.