Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: సెలెక్టర్లు దేవుళ్లేం కాదు.. సర్ఫరాజ్ ఎంపిక విషయంలో మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్!

సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి తీసుకోకపోవడంపై పలువురు మాజీలు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతని కన్నా తక్కువ స్ట్రైక్ రేట్, సగటు ఉన్న గైక్వాడ్‌కు వెస్టిండీస్ టూర్‌లో అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరకు జట్టు ప్రకటించినప్పుడు సర్ఫరాజ్ పేరు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ అలా జరగలేదు.

ఈ క్రమంలోభారత్ బాజీ దిగ్గజం డబ్ల్యూవీ రామన్ సెలెక్టర్లు ఇలా చేసిన కారణాన్ని వివరించే ప్రయత్నం చేశాడీ మాజీ హీరో. అలాగే సర్ఫరాజ్ యాటిడ్యూడ్, ఫిట్‌నెస్ వల్ల అతన్ని ఆడించలేదని అన్నారు. దీనిపై కూడా రామన్ వివరణ ఇచ్చాడు. 'సర్ఫరాజ్‌ను తీసుకోకపోవడంపై సెలెక్షన్ కమిటీ కొన్ని అభిప్రయాలు తెలిపింది. వాటిలో అతని ఆటతీరు కూడా ఒటటి' అని రామన్ తెలిపాడు.

Sarfaraz Khan

'ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడం, ఫీల్డింగ్ మెరుగు పరుచుకోవడం, ఫిట్‌నెస్ సాధించడం.. వంటి కారణాలను సెలెక్టర్లు చెప్పారు. ఇలా వాళ్లు చెప్పిన మాటలు విని, సెలెక్టర్లు ఏమైనా దేవుళ్లు అనుకుంటున్నారా? అన్నీ తెలిసినట్లు మాట్లాడానికి? అని మీరు అడగొచ్చు. కానీ వాళ్లేమీ సర్ఫరాజ్ విషయంలో ప్రత్యేకంగా లోపాలు వెతాకలని ట్రై చేయొచ్చు' అని రామన్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ఆడిన సమయంలో సర్ఫరాజ్ ఖాన్.. పేసర్లను ఎదుర్కోవడానికి పడిన ఇబ్బందులు బయటపడ్డాయి. ముఖ్యంగా షార్ట్ బాల్స్‌ను అతను ఆడలేకపోయాడు. ఈ కారణంగానే అతన్ని జట్టులోకి తీసుకోలేదని ప్రచారం జరిగింది. దేశవాళీల్లో మూడు సీజన్లుగా చెలరేగుతున్న అతనికి అవకాశం ఇవ్వాలని సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు కూడా అడుగుతున్నారు.

కానీ అసలు అతని ఐపీఎల్ ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని బాగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని, అతని ఆటతీరుతో సెలెక్టర్లు సంతృప్తిగానే ఉన్నారని, అయితే అతని యాటిడ్యూడ్ మార్చుకుంటే టీమిండియాలోకి కచ్చితంగా వస్తాడని వివరించాడు. మరి సర్ఫరాజ్ ఈ విషయాల్లో ఎలా మెరుగవుతాడో చూడాలి.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

Story first published: Saturday, July 1, 2023, 10:33 [IST]
Other articles published on Jul 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+