Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: కెప్టెన్‌కు బుర్రలేదు.. ఫేవరిటిజం ఎక్కువైంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ ఆగ్రహం!

వెస్టిండీస్ చేతిలో భారత జట్టు ఘోర పరాభవం చవి చూసి టీ20 సిరీస్ కోల్పోవడం చాలా మందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని చీల్చి చెండాడాడు. కెప్టెన్‌గా హార్దిక్ అలు పనికాడని విమర్శించాడు.

ప్రస్తుతం బీసీసీఐ సిస్టం అంతా ఫేవరిటజంతో నిండిపోయిందని, అందుకే జట్టు ఇలా ఓడిపోయిందని వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ సందర్భంానే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని ప్రసాద్ టార్గెట్ చేశాడు. వరుస ట్వీట్లలో టీమిండియా, బీసీసీఐ, హార్దిక్ పాండ్యా అందరిపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టు విజయాల బాట పట్టాలంటే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు.

Former legend slams Team India for loosing T20I series against West Indies

'టీంలో గెలవాలనే ఆకలి, ఇంటెన్సీటీ లేవు. కొన్నిసార్లు కెప్టెన్ తనేం చేస్తున్నాడో తెలియనట్లు కనిపించాడు. బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు, బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనం ఏం చెప్పినా చేసే వాళ్లను చుట్టూ ఉంచుకుంటే సరిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక ప్లేయర్ తన ఫేవరెట్ అయినా కూడా.. ఓవరాల్‌గా జట్టుకు ఏది ముఖ్యమో అదే చేయాలి' అని చెప్పాడు.

విండీస్ చేతిలో ఓటమిలో కెప్టెన్, టీం మేనేజ్‌మెంట్ పాత్ర గురించి కూడా ప్రసాద్ మాట్లాడాడు. ప్రస్తుత టీం 'ప్రాసెస్' అనే పదాన్ని వృధాగా వాడుతోందన్నాడు. ఎంఎస్ ధోనీ ఈ పదాన్ని సరిగా వాడేవాడని, కానీ ప్రస్తుతం టీం అలా కాదన్నాడు. ఈ ఓటమికి కారణం వాళ్లేనని, దానికి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పాడు. టీం సెలెక్షన్‌లో నిలకడ లేదని, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని విమర్శించాడు.

'ప్రాసెస్.. ఇలాంటివన్నీ జస్ట్ పదాలు. వాటిని ప్రస్తుతం బాగా మిస్‌యూజ్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీ వీటిని సరిగా వాడే వాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ పదాలు వాడుతున్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు' అని ప్రసాద్ అన్నాడు. చివరి టీ20 ఓడిన తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ప్రాసెస్ గురించి మాట్లాడాడు. అందుకే ప్రసాద్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

Story first published: Monday, August 14, 2023, 14:21 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+