ఇచ్చిన అవకాశాలు వేస్ట్.. గిల్ వైఫల్యంపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!
టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు అని, అతను టీంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చెయ్యగలడు అని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మూడో స్థానంలో ఆడిన గిల్ తేలిపోయిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అత్యంత ఘోరంగా విఫలమైన అతను.. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా రాణించలేదు.
అయితే రెండో ఇన్నింగ్స్ లో గిల్ ఆకట్టుకున్నాడు. వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో ఇషాన్ కిషన్ కు చక్కగా సహకారం అందించాడు. ఇక ఐదో రోజు వర్షం వల్ల ఆట రద్దు అవడంతో రెండో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సిరీసులో గిల్ ఆటతీరు గురించి జాఫర్ మాట్లాడాడు. గిల్ ఇలా మూడో స్థానంలో కొనసాగడం మంచిదేనా? అని ప్రశ్నిస్తే బదులిచ్చాడు.

"గిల్ మంచి ప్లేయర్. అలాంటి వాళ్ళు ఒకటి నుంచి ఐదు వరకు.. ఏ స్థానంలో అయినా ఆడగలరు. గిల్ దగ్గర అలాంటి ఆట ఉంది. ఇలా పొజిషన్ మారే టైంలో తను కూడా ఆలోచించే ఉంటాడు. అండర్ -19 వరల్డ్ కప్ లో కూడా అతను 3 లేదా 4వ నంబర్లో ఆడాడు కదా" అని జాఫర్ అన్నాడు.
"కానీ తను ఓపెనింగ్ చెయ్యడమే మనం చూశాం. గిల్ ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఆశ్చర్యపడటం లేదు. 150 ఓవర్లు ఫీల్డింగ్ చేసిన తర్వాత వెంటనే ఓపెనింగ్ చెయ్యడం మా ఓపెనర్ల సమస్య. అదే మూడో నంబర్లో అయితే కొంచం టైం దొరుకుతుంది" అని వివరించాడు.
అయితే విండీస్ టూర్లో గిల్ ప్రదర్శన చెత్తగా ఉందని జాఫర్ స్పష్టం చేశాడు. "తనకు రెండు మంచి అవకాశాలు వచ్చాయి. అయినా రాణించలేదు. కాకపోతే ఇది కొత్త కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఈ టూర్లో అతని ప్రదర్శన ఏమాత్రం బాగలేదు" అని తేల్చి చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications