Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : మరీ ఇంత గొప్ప ప్లాన్ వేశారే?.. విండీస్ టీంను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

వెస్టిండీస్‌తో తొలి టెస్టును భారత జట్టు ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు.. తాము ఎంత తప్పు చేసిందో వెంటనే తెలిసొచ్చింది. ఆ టీంలో ఎక్కువ అంచనాలు ఉన్నది కెప్టెన్ బ్రాత్‌వైట్ (20), ఓపెనర్ టగనరైన్ చందర్‌పాల్ (12) మీదనే. వీళ్లిద్దరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందడంతో.. తను బంతి అందుకున్న కాసేపటికే చందర్‌పాల్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లోనే రోహిత్‌కు క్యాచ్ ఇచ్చిన బ్రాత్‌వైట్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

INDvsWI

ఇక జడేజా కూడా మరో ఎండ్ నుంచి వికెట్లు తీసుకోవడంతో విండీస్ విలవిల్లాడింది. లోకల్ బాయ్, తొలి మ్యాచ్ ఆడుతున్న అథనాజ్ (47) ఒక్కడే కొంత పోరాటం చూపించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ 20 పరుగుల మార్కు కూడా దాటలేకపోయారు. దీంతో ఆ జట్టు కేవలం 150 పరుగులకే చాపచుట్టేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్.. తాము పక్కా ప్రణాళికతో బరిలో దిగుతున్నామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ నుంచి నిలకడగా ఆడటమే తమ ప్లాన్ అని, చివరి మ్యాచ్ వరకు అదే చేస్తామని ధీమాగా చెప్పాడు. కానీ అతను కూడా దారుణంగా ఫెయిలయ్యాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. అతన్ని, విండీస్ టీంను ట్రోల్ చేస్తున్నారు.

'ఇదేనా నువ్వు వేసిన గొప్ప ప్లాన్?' అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో 'మరీ ఇంత నిలకడగా ఆడతారా?' అంటూ ఎగతాళి చేస్తున్నారు. విండీస్ బ్యాటర్లు తేలిపోయిన అదే పిచ్‌పై భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. రోహిత్ (30 నాటౌట్), యశస్వి జైస్వాల్ (40 నాటౌట్) ఇద్దరూ రాణించారు.

Story first published: Thursday, July 13, 2023, 8:39 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+