Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: ఇదేనా టీమిండియా ఫ్యూచర్?.. గిల్‌పై నెట్టింట పేలుతున్న జోకులు!

టీమిండియా యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌కు విండీస్ టూర్ కలిసి రాలేదు. టెస్టు సిరీసులో తేలిపోయిన అతను.. వన్డేల్లో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో రాణించాడు. ఇక టీ20 సిరీస్ మొదలైనప్పటి నుంచే అతని దురదృష్టం మొదలైంది. వరుసగా మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరాడీ కుర్ర ఓపెనర్.

సిరీస్ సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో కూడా గిల్ తేలిపోయాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతు 6 బంతులు చేసి పెవిలియన్ చేరాడు. ఇలా అతను వరుసగా విఫలం అవడంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఐపీఎల్‌లో చెలరేగిన గిల్.. అంతకుముందు కివీస్‌తో జరిగిన టీ20 సిరీసులో సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

INDvsWI Fans troll Shubman Gill for poor form in T20Is

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్‌లో తన తొలి సెంచరీ సాధించాడీ పంజాబ్ కుర్రాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్‌లో అతని ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 890 పరుగులతో రాణించాడు. ఒకానొక దశలో కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (973) రికార్డును కూడా బద్దలు కొట్టేలా కనిపించాడు.

కానీ ఐపీఎల్ తర్వాత అతని ఫామ్ యూటర్న్ తీసుకుంది. టెస్టుల్లో దారుణంగా ఫెయిలైన అతను.. పొట్టి ఫార్మాట్లో కూడా తేలిపోతున్నాడు. దీంతో గిల్‌ను నెట్టింట ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మూడో టీ20లో కూడా ఫెయిలవడంతో.. 'గిల్‌ను అర్జెంటుగా అహ్మదాబాద్‌లో ఆడించండి. లేదంటే రిటైర్ అయిపోవాల్సి వస్తుంది' అంటూ జోకులు పేలుస్తున్నారు.

అహ్మదాబాద్ వంటి బ్యాటింగ్ పిచ్ లేకపోతే గిల్ కెరీర్ ముగిసినట్లే అంటూ ఎటకారం ఆడుతున్నారు. 'వీడేనా మీ ఫ్యూచర్ స్టార్?' అని ఎగతాళి చేస్తున్నారు. కనీసం వెస్టిండీస్‌పై కూడా సరిగా ఆడలేని గిల్.. టీమిండియా ఫ్యూచర్ అన్న వాళ్లకు బుర్ర లేదంటూ తిట్టిపోస్తున్నారు. మరి చివరి రెండు మ్యాచుల్లో అయినా గిల్ రాణించి.. ఈ విమర్శలకు జవాబు ఇస్తాడేమో చూడాలి.

Story first published: Wednesday, August 9, 2023, 9:44 [IST]
Other articles published on Aug 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+