విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత టీం మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై వేటు వేసింది. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. అక్కడితో ఆగకుండా కుర్ర స్పిన్నర్ రవి బిష్ణోయిని కూడా పక్కన పెట్టినట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.
రెండో టీ20లో ఆడిన బిష్ణోయి బంతితో పెద్దగా రాణించలేదు. తను వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. తన చివరి ఓవర్లో మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినా సరే అతన్ని పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం ఫ్యాన్స్‌కు పెద్దగా నచ్చలేదు.

తొలి ఓవర్లోనే 18 పరుగులు ఇచ్చినా కూడా.. చివరకు నాలుగు ఓవర్లలో బిష్ణోయి ఇచ్చింది కేవలం 31 పరుగులే అని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఇంత గొప్పగా బౌలింగ్ చేసిన బిష్ణోయిని పక్కన పెట్టాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అసలు చాహల్‌ను పక్కన పెట్టేసి బిష్ణోయిని ఆడించాల్సిందని అంటున్నారు.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇలాంటి బుద్ధి లేని నిర్ణయాలు తీసుకోవడం వల్లనే వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోయిందని మండిపడుతున్నారు. ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి, ఆ వెంటనే బిష్ణోయిని పక్కన పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని కొందరు నిపుణులు కూడా అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో కిషన్ లేకపోవడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ శాంసన్ తీసుకుంటాడని పాండ్యా చెప్పాడు. సంజూ కూడా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించింది లేదు. ఈ మ్యాచ్‌లో కనుక అతను ఫెయిలైతే.. జట్టులో సంజూ చోటు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే కిషన్ స్థానానికి ఎలాంటి ప్రమాదం లేదని, కాబట్టి పక్కన పెట్టినా అతను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.