వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. తొలి మ్యాచ్ బుధవారం నాడు మొదలవనుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లంతా కొత్త జెర్సీలో ఫొటోలు దిగారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికి లీడ్ స్పాన్సర్ ఎవరూ లేరు
దీంతో స్పాన్సర్ లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు బరిలో దిగింది. ఇటీవల లీడ్ స్పాన్సర్ కోసం టెండర్లు పిలవగా.. ప్రముఖ ఫాంటసీ క్రికెట్ లీగ్ యాప్ డ్రీమ్11 ఈ అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో విండీస్‌తో తొలి టెస్టులో తొలిసారి కొత్త జెర్సీతో భారత ఆటగాళ్లు బరిలో దిగనున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఫొటో షూట్‌లో టీమిండియా స్టార్లు కొత్త జెర్సీలో మెరిశారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. ఇలా అందరూ కొత్త జెర్సీలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఎర్రని 'డ్రీమ్11' లోగో వల్ల టెస్టు జెర్సీ అందం అంతా పోయిందని అంటున్నారు. మరికొందరైతే అసలు ఇది టెస్టు జెర్సీనేనా? అని నిలదీస్తున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్‌కు ఈ జెర్సీ అంత నచ్చలేదని అర్థం అవుతోంది.
వెస్టిండీస్‌తో తొలి టెస్టు డొమినికా వేదికగా జరగనుంది. ఇక్కడి విండ్‌సోర్ మైదానంలో భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు తొలి టెస్టు ఆడనున్నారు. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లు అంత గొప్ప ఫామ్‌లో లేరు. అదే సమయంలో అనుభవం లేని బౌలింగ్ విభాగంతో భారత జట్టు విండీస్‌లో అడుగు పెట్టింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెస్టిండీస్‌ను భారత జట్టు ఓడిస్తుందా? అని కొందరు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా కోహ్లీ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.