Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: ఇది రో బాల్.. రోహిత్ ధనాధన్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా!

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణమైన ఆటతో అలరించాడు. టీ20 తరహా బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను 255 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు రోహిత్ అదిరే ఆరంభం అందించాడు.

ఎడాపెడా బౌండరీలు బాదిన అతను కేవలం 44 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన కెరీర్ లో అత్యంత వేగవంతమైన టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 భారీ సికర్లు ఉన్నాయి. రోహిత్ కు తోడు జైస్వాల్ కూడా ధాటిగా ఆడటంతో భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది.

INDvsWI fans in delight to see Rohit Sharma blasting innings

రోహిత్ ఈ మ్యాచులో కేవలం 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు జైస్వాల్ తో కలిసి భారత్ తరపున ఏ వికెట్ కి అయినా అత్యంత వేగంగా 50 పరుగుల భాగ్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలే ఓడిపోతామని బాధలో ఉన్న విండీస్ టీమ్ పై రోహిత్ ఇలా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదంటూ జోకులు పిలుస్తున్నారు.

ఈ ఇన్నింగ్స్ లో కూడా ఆకట్టుకున్న రోహిత్, జైస్వాల్ జోడీ.. ఈ సీరీస్ ఆసాంతం టీంకు అద్భుతమైన ఆరంభాలు అందించడం గమనార్హం. తొలి టెస్టులో వీళ్లిద్దరూ మొదటి వికెట్ కు ఏకంగా 229 పరుగులు జతచేశారు. ఆ మ్యాచులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఈ జోడీ మంచి ఆరంభాన్ని అందించింది.

ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 139 పరుగుల భాస్వామ్యాన్ని నెలకొల్పిన వీళ్లిద్దూ.. రెండో ఇన్నింగ్స్ లో 98 రన్స్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్, నిపుణులు అందరూ ఈ జోడీ ఆటతీరును మెచ్చుకుంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ ఆటకు ఫ్యాన్స్ దాసోహం అంటున్నారు. "ఇది బాజ్ బాల్ కాదు. రో బాల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Story first published: Monday, July 24, 2023, 8:55 [IST]
Other articles published on Jul 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+