Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: నువ్వసలు మనిషివేనా?.. సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..!

టీమిండియాలోకి చాలా మంది కుర్రాళ్లు వచ్చేస్తున్నారు. కానీ వాళ్లెవరూ కూడా ఫిట్ నెస్ విషయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పోటీ పడలేరు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో ఒకడైనా కూడా కోహ్లీ ఇప్పటికీ మైదానంలో చిరుతలా కదులుతూనే ఉంటాడు. తనతో కలిసి ఆడుతున్న కుర్రాళ్లకు స్ఫూర్తిని ఇస్తుంటాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ దారుణంగా ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను భారత స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. జడ్డూ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఆ టీం కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ టీం కెప్టెన్ షాయి హోప్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

INDvsWI Fans in awe of Virat Kohli as he takes stunning catch

ఈ క్రమంలో విండీస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ రొమేరియో షెఫర్డ్ కూడా విఫలమయ్యాడు. భారీ షాట్లు ఆడటంలో దిట్ట అయిన షెఫర్డ్.. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. అప్పటికి విండీస్ స్కోరు 96/5. ఇలాంటి కష్ట కాలంలో అతను జట్టును ఆదుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ జడేజా బౌలింగ్‌లో అతను అదే ఓవర్లో పెవిలియన్ చేరాడు. కోహ్లీ అందుకున్న సూపర్ క్యాచ్‌తో అతను మైదానం వీడక తప్పలేదు.

ఆఫ్ స్టంప్ ఆవలగా జడేజా వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు షెఫర్డ్ ప్రయత్నించాడు. కానీ లైన్ మిస్ అవడంతో ఆ బంతి ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్స్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. చాలా వేగంగా రియాక్ట్ అయిన కోహ్లీ.. దాన్ని సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసిన కామెంటేటర్లు, ఫ్యాన్స్, మిగతా ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. కోహ్లీని తెగ మెచ్చుకున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Story first published: Friday, July 28, 2023, 9:17 [IST]
Other articles published on Jul 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+