Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : కల నిజమైన వేళ.. జైస్వాల్ అరంగేట్రంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

విండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు తరఫున ఇద్దరు యువ ప్లేయర్లు అరంగేట్రం చేశారు. వారిలో యశస్వి జైస్వాల్ ఒకడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అద్భుతమైన ఆటతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించిన అతను.. దేశవాళీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. దానికితోడు ఎడం చేతి వాటం బ్యాటర్ కూడా కావడం జైస్వాల్‌కు కలిసొచ్చింది.

ఈ క్రమంలోనే విండీస్‌తో తొలి టెస్టులో అతనికి టీమిండియా క్యాప్ అందించారు. ఇక తొలి రోజు విండీస్ ఆలౌట్ అవడంతో బ్యాటింగ్‌కు వచ్చిన జైస్వాల్ చక్కగా ఆడాడు. చూడచక్కని షాట్లతో అలరించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. అసలు ఈ అరంగేట్రానికి ముందు కూడా జైస్వాల్ ఆటతీరును రహానే, అశ్విన్ తదితరులు తెగ మెచ్చుకున్నారు.

INDvsWI Fans happy for Yashasvi Jaiswal as he makes a good debut

ఇక విండీస్‌పై అతని ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్‌కు వాళ్లు అతన్ని ఎందుకు మెచ్చుకున్నారో అర్థమైంది. ఏమాత్రం కొత్త బ్యాటర్‌లా జైస్వాల్ ఆడలేదు. అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతూనే.. అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అతనికి ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నారు. జైస్వాల్‌ను నెట్టింట కంగ్రాట్స్ చెప్తున్నారు.

అంతేకాదు, మరికొందరైతే 'కలలు కూడా నిజం అవుతాయి కదా' అంటూ అతను టీమిండియా అరంగేట్రం చేసినందుకు సంతోషిస్తున్నారు. ఈ అరంగేట్రంతో జైస్వాల్ కెరీర్‌లో మరో ఛాప్టర్ మొదలవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అతను కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అని ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు. అతని ఆటతీరు చూస్తుంటే అంతర్జాతీయ క్రికెట్‌ను కూడా చాలాకాలం ఏలతాడని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వకుండా జైస్వాల్‌కు ఛాన్స్ దక్కడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన జైస్వాల్ బ్యాటుతో ఆకట్టుకోగా.. అతనితోపాటు అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ తన వికెట్ కీపింగ్‌ స్కిల్స్‌ను చూపించాడు. అతను కనుక బ్యాటింగ్‌లోనూ రాణిస్తే ఇక భరత్‌కు మళ్లీ అవకాశం దక్కడం కష్టమే అని చెప్పాలి.

Story first published: Thursday, July 13, 2023, 11:34 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+