వెస్టిండీస్‌తో .జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు చెలరేగారు. ఈ సిరీసులో తొలిసారి జట్టుకు అదిరే ఆరంభం అందించారు. తన రెండో మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (84 నాటౌట్)తోపాటు వరుస వైఫల్యాలతో సతమతమైన శుభ్‌మన్ గిల్ (77) కూడా చెలరేగాడు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు మంచి స్కోరు చేసింది. షిమ్రాన్ హెట్మెయర్ రాణించడంతో 177 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు చెలరేగారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే జైస్వాల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో కొంత సమయం తీసుకున్న గిల్.. క్రీజులో కుదురుకున్నాడు.

ఇక ఆ తర్వాత అతను కూడా ఎడాపెడా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో వీళ్లు ఇటీవలి కాలంలో భారత్‌క దక్కిన అతి భారీ ఓపెనింగ్ రికార్డు సాధించారు. ఈ క్రమంలో శ్రీలంకపై రోహిత్, కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశారు. ఇలా జైస్వాల్, గిల్ చెలరేగడంతో వీళ్లిద్దరే మ్యాచ్ ముగించేస్తారని అంతా అనుకున్నారు. కానీ చివర్లో గిల్ అవుటయ్యాడు.
ఇంత మంచి ఓపెనింగ్ పార్టనర్ షిప్ చూసిన టీమిండియా ఫ్యాన్స్.. వీళ్లిద్దర్నీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫ్యూచర్‌కు ఓపెనింగ్ జోడీ దొరికేసిందని మెచ్చుకుంటున్నారు. రోహిత్, ధావన్ తర్వాత మళ్లీ లెఫ్ట్, రైట్ కాంబినేషన్లో అదిరే జోడీ దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే టీమిండియా ఫ్యూచర్ అంటున్నారు.
కీలకమైన మ్యాచ్‌లో కుర్రాళ్లు చెలరేగడం చాలా సంతోషాన్ని ఇస్తోందని మాజీ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో గిల్, జైస్వాల్ ఇద్దరిలో ఎవరో ఒకరు సెంచరీ పూర్తి చేసుకుంటారని తొలుత అందరూ భావించారు. కానీ చివర్లో ఇద్దరూ మూడంకెల స్కోరు చేరుకోలేకపోవడం కొంత బాధాకరం. ఏదేమైనా టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో ఓపెనింగ్ సమస్యను జైస్వాల్, గిల్ తీర్చినట్లే కనిపిస్తోంది.