Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: ఈ కెప్టెన్ క్లౌన్ వల్లే ఓడిపోయాం.. పాండ్యా చెత్త కెప్టెన్సీని ఎండగడుతున్న ఫ్యాన్స్!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయాలు ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. అసలే టీమిండియా బ్యాటింగ్ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇలాంటి సమయంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఈ టీం కేవలం 152/7 స్కోరు మాత్రమే చేయగలిగింది.

ఒక్క తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (51) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటింగ్ యూనిట్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. స్లోగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడానికి తెగ కష్టపడ్డారు. ఇక ఛేజింగ్‌లో భారత్‌కు బంతితో పాండ్యా మంచి ఆరంభం అందించాడు.

INDvsWI Fans call Hardik Pandya Captain Clown

కానీ నికోలస్ పూరన్ (67) విధ్వంసం సృష్టించి ఈ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. చివర్లో అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్), అకీల్ హొస్సేన్ (16 నాటౌట్) లాంఛనం పూర్తిచేశారు. ఈ మ్యాచ్‌లో 16వ ఓవర్ వేసిన యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షిమ్రాన్ హెట్మెయర్ (22), జేసన్ హోల్డర్ (0) ఇద్దర్నీ అవుట్ చేశాడు.

అతని బౌలింగ్ ఎదుర్కోవడానికి విండీస్ బ్యాటర్లు తెగ కష్టపడ్డారు. అదే ఓవర్లో ఒక రనౌట్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ చాహల్‌కు బంతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం చాలా మందికి అర్థం కాలేదు. ఇంత చక్కగా బౌలింగ్ చేస్తున్న చాహల్‌ కనీసం తన కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.

ఇలాంటి నిర్ణయం పాండ్యా ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ ఎవరికీ అర్థం కాలేదు. దీంతో అతన్ని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో పాండ్యా మాట్లాడుతూ.. టీమిండియా మరో రెండు టీమ్స్ తయారు చేసి కూడా ఎక్కడైనా సిరీస్ గెలవగలదని అన్నాడు. అది గుర్తు చేస్తున్న ఫ్యాన్స్... 'కెప్టెన్ క్లౌన్' అంటూ ఎగతాళి చేస్తున్నారు.

Story first published: Monday, August 7, 2023, 8:36 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+