Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో వేస్ట్ ప్లేయర్.. ఆటకు పనికిరాని ఆటగాడు.. గిల్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు అద్బుమైన ఆరంభం అందించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వెస్టిండీస్‌ను పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేశారు. ఆ టీంలో కెప్టెన్ షాయి హోప్ మినహా ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో ఆ జట్టు కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో భారత్‌కు కూడా అనుకున్న ఆరంభం దక్కలేదు. అద్భుతంగా రాణిస్తాడని అనుకున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7) చాలా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడబోయిన గిల్.. స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అసలు ఈ మ్యాచ్‌లో గిల్ ఏమాత్రం కంఫర్టబుల్‌గా కనిపించలేదు. మొత్తం 16 బంతులు ఆడిన అతను.. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన షాట్ కొట్టలేదు.

INDvsWI Fans brutally troll Shubman Gill for failing in first ODI

అతని ఇన్నింగ్స్‌లో ఒక బౌండరీ ఉన్నా కూడా.. అది టాప్ ఎడ్జ్ తీసుకున్నది కావడం గమనార్హం. స్లిప్స్ పై నుంచి ఈ బంతి దూసుకుపోవడంతో బౌండరీ వెళ్లింది. గిల్ ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. అంతకుముంందు టెస్టు సిరీసులో కూడా గిల్ తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాన్స్ అతని తెగ ట్రోల్ చేస్తున్నారు. గిల్ ఖేల్ ఖతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గిల్ ఇలాగే ఆడితే వరల్డ్ కప్‌లో జట్టును ముంచేస్తాడని, అతను ఫామ్ అందుకోకపోతే వరల్డ్ కప్‌కు తీసుకోవద్దని ఫ్యాన్స్ అంటున్నారు. విదేశీ మ్యాచుల్లో ఓపెనర్‌గా గిల్ కంటే కేఎల్ రాహుల్ వంద రెట్లు నయమని కొందరు అంటున్నారు. టీంలో అతను 'నాన్ పెర్ఫామెన్స్ అసెట్' అంటూ జోకులు పేలుస్తున్నారు. అహ్మదాబాద్‌లో ఫ్లాట్ పిచ్‌లపైనే గిల్ ఆడతాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి అతను వచ్చే మ్యాచుల్లో రాణించి విమర్శకులకు గట్టి సమాధఆనం ఇస్తాడేమో చూడాలి.

Story first published: Friday, July 28, 2023, 8:59 [IST]
Other articles published on Jul 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+