Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : గిల్, కిషన్ ఇద్దరూ ఫెయిల్.. ఇదేం బ్యాటింగ్? అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టుకు అనుకున్న ఆరంభం లభించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ అనుకున్న స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆ టీంలో ఉన్న ఎవర్నీ భారీ షాట్లు పెద్దగా ఆడనివ్వలేదు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనను భారత జట్టు ఈజీగా పూర్తి చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ టీమిండియాకు కూడా అనుకున్న ఆరంభం లభించలేదు. చివరి వన్డేలో మంచి ఫామ్ కనబరిచిన శుభ్‌మన్ గిల్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.

Ishan Kishan

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఈ క్రమంలో 8 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఒత్తిడికి గురైన అతను.. అకీల్ హొస్సేన్ బౌలింగ్‌లో రిస్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. టాస్డ్ అప్ డెలివరీని ముందుకొచ్చి బౌండరీ బాదేందుకు ట్రై చేశాడు.

కానీ ఆ బంతి టర్న్ అవడంతో గిల్ మిస్సయ్యాడు. కీపర్ జాన్సన్ చార్లెస్ దాన్ని అందుకొని సింపుల్ స్టంపింగ్ పూర్తి చేశాడు. దీంతో గిల్ మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారత ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే ఈ టూర్ మొత్తం మంచి ఫామ్ కనబరిచిన ఇషాన్ కిషన్ క్రీజులోనే ఉండటంతో పెద్దగా టెన్షన్ పడలేదు.

అతను కూడా ఈ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం గమనార్హం. కిషన్ కూడా భారీ షాట్లు ఆడకుండానే ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అప్పటికే 8 బంతులు ఆడిన అతను కేవలం 6 పరుగులే చేశాడు. దీంతో ఒత్తిడికి గురైన కిషన్ ఓబెడ్ మెకాయ్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ట్రై చేశాడు. ముందుకొచ్చి ఆడిన లాఫ్ట్ షాట్ సరిగా కనెక్ట్ కాలేదు.

దీంతో నేరుగా ఫీల్డర్ వద్దకు క్యాచ్ వెళ్లింది. దాన్ని కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ పట్టేయడంతో కిషన్ కూడా నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ఇలా ఓపెనర్లు ఇద్దరూ విఫలం అవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీళ్లిద్దరూ అవుటవడం కన్నా కూడా.. అవుటైన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవేం షాట్లు? అంటూ నిలదీస్తున్నారు.

Story first published: Thursday, August 3, 2023, 23:14 [IST]
Other articles published on Aug 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+