Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : ఏం క్యాచులు పట్టావురా?.. తిలక్ వర్మ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

వెస్టిండీస్‌తో తొలి టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రంలోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టుకు బ్రాండన్ కింగ్ (28) మంచి ఆరంభం అందించాడు. అయితే యుజ్వేంద్ర చాహల్ తన తొలి ఓవర్లోనే విండీస్ ఓపెనర్లు ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అతని బౌలింగ్‌లో జాన్సన్ చార్లెస్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. స్పిన్ బౌలింగ్ ఆడేందుకు కొంత తడబడే చార్లెస్ రిస్క్ తీసుకొని భారీ సిక్సర్ కొట్టేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు.. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ దూసుకొచ్చాడు.

Tilak Varma

చాలా దూరం కవర్ చేసిన తిలక్.. సరైన టైంలో డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే తిలక్ అందుకున్న క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. కామెంటరీ చెప్తున్న మాజీ దిగ్గజాలు కూడా తిలక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని తెగ మెచ్చుకున్నారు. దీంతో కేవలం 3 పరుగులే చేసిన చార్లెస్ పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత మరోసారి కీలకమైన క్యాచ్ అందుకున్న తిలక్.. జట్టుకు మరో బ్రేక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకొని హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న విండీస్ స్టార్ నికోలస్ పూరన్ (41)ని కూడా తిలక్ పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్ బాల్‌ను భారీ షాట్ బాదేందుకు పూరన్ ప్రయత్నించాడు. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఈ బంతి వెళ్లింది.

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ ఎలాంటి పొరపాటు చేయకుండా చక్కగా ఈ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పూరన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ రెండు క్యాచుల్లో తిలక్ చూపించిన కంపోజర్ చూసిన ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. మంచి అనుభవం ఉన్న ప్లేయర్‌లా తిలక్ ఆడుతున్నాడని కొనియాడుతున్నారు.

Story first published: Thursday, August 3, 2023, 22:58 [IST]
Other articles published on Aug 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+