Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో ఐపీఎల్ లేదు కదా.. సూరీడిని వెనకేసుకు రావడానికి ద్రావిడ్ చెత్త వాగుడు!

వన్డే వరల్డ్ కప్ వచ్చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని జట్లు తమ బలమైన జట్లను రెడీ చేసుకుంటున్నాయి. భారత్ కూడా అదే పనిలో ఉంది. కానీ ఈ టీంకు సూర్యకుమార్ యాదవ్ పెద్ద సమస్యగా మారాడు. టీ20ల్లో నెంబర్ వన్‌ బ్యాటర్‌గా ఉన్న అతను.. వన్డేల్లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో అతనికి అవకాశం లభించింది. రెండింటా విఫలమైన అతను 19, 24 స్కోర్లు నమోదు చేశాడు. ఇలా విఫలం అవుతున్న అతనిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్య ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడని వెనకేసుకొచ్చాడు.

dravidsky

2021 జులై నెలలో వన్డే అరంగేట్రం చేసిన సూర్య.. ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో 25 మ్యాచులు ఆడాడు. వీటిలో కేవలం 23.80 సగటుతో 476 పరుగులే చేశాడు. గత 17 ఇన్నింగ్సుల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. విండీస్ టూర్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీసులో వరుసగా మూడు గోల్డెన్ డక్‌లు నమోదు చేశాడు.

దీనిపై స్పందించిన ద్రావిడ్.. 'సూర్య చాలా అద్భుతమైన ప్లేయర్. టీ20లు, దేశవాళీల్లో ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో ఈ విషయాన్ని అతను నిరూపించుకున్నాడు. అయితే తన వన్డే గణాంకాలు ఏమాత్రం స్థాయికి తగ్గట్లు లేవని అందరి కన్నా ముందు ఒప్పుకునేది కూడా అతనే. వన్డేలు ఆడటం ఇంకా నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు' అని చెప్పాడు.

'టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసే ముందు.. అతను ఈ ఫార్మాట్‌లో చాలా మ్యాచులు ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో దీని గురించి చాలా అర్థం చేసుకున్నాడు. కానీ వన్డేల్లో అతనికి ఇంత అనుభవం లేదు. ఎందుకంటే వన్డేలకు ఐపీఎల్ లేదు కదా. అందుకే ఈ ఫార్మాట్‌లో, ముఖ్యంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు' అని ద్రావిడ్ తెలిపాడు.

'అతని ట్యాలెంట్ తెలుసు కాబట్టే అతనికి అవకాశాలు ఇస్తున్నాం. సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. వాటిని సరిగా యూజ్ చేసుకునే బాధ్యత మాత్రం అతనిదే. ప్రస్తుతం మేం ఉన్న సెటప్‌లో ఒక ప్లేయర్‌కు ఎన్ని అవకాశాలు కావాలంటే అన్ని అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం' అని సూర్యకు మద్దతుగా నిలిచాడీ లెజెండ్.

ఈ మాటలు విన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంటే సూర్య ఒక్కడి కోసం వన్డేల్లో ఐపీఎల్ పెట్టాలా? అని అడుగుతున్నారు. వన్డేలు ఆడటం రాకపోతే అతన్ని కేవలం టీ20లే ఆడించొచ్చు కదా అంటున్నారు. వన్డేల్లో ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకోకుండా.. చెత్తగా ఆడుతున్న వాళ్లకే అవకాశాలు ఇవ్వడం, వారిని వెనకేసుకు రావడానికి ఇలా చెత్త వాగుడు వాగడం దేనికని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Sunday, July 30, 2023, 16:45 [IST]
Other articles published on Jul 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+