డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత బ్యాటింగ్ విభాగం అంతా ఫెయిలైంది. కానీ ఆ తర్వాత జరుగుతున్న విండీస్ సిరీస్‌కు మాత్రం కేవలం ఛటేశ్వర్ పుజారా మీదనే వేటు వేశారు. దీనిపై కొందరు మాజీలు, ఫ్యాన్స్ మండిపడ్డారు. పుజారాకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు లేరు.
కాబట్టి అతన్ని జట్టులో నుంచి తొలగించినా పెద్ద గొడవ జరగదనే తీసేశారా? కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ల విషయంలో అలాగే చేస్తారా? వాళ్లేమైనా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణించారా? అంటూ మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా లైవ్‌లో మండిపడ్డాడు. ఈ క్రమంలో భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత పుజారా తొలిసారి స్పందించాడు.

విండీస్ టూర్‌లో ఆడే భారత జట్టులో అతని పేరు లేకపోవడంతో దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ బృందంలో అతని పేరును ప్రకటించారు. ఈ క్రమంలోనే నెట్స్‌లో కఠోర శ్రమ చేస్తున్న వీడియోను పుజారా షేర్ చేశాడు. దాంతోపాటు 'క్రికెట్, లవ్' ఎమోజీలను పోస్టు చేశాడు. తనకు క్రికెట్‌పై చాలా ప్రేమ ఉందనే మీనింగ్ వచ్చేలా ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, జట్టులో తను స్థానం కోల్పోయినందుకు పుజారా పెద్దగా టెన్షన్ కూడా పడుతున్నట్లు కనిపించడం లేదు. దేశవాళీలతోపాటు కౌంటీల్లో కూడా తన ఆటను కంటిన్యూ చేసి, మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకంతో కనిపిస్తున్నాడు. పుజారాతోపాటు మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌కు కూడా విండీస్ టెస్టు సిరీసులో చోటు దక్కకపోవడం గమనార్హం.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.