వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత జట్టు చిత్తుగా ఓడింది. దీంతో రెండో టీ20లో టీం కూర్పుపై పెద్ద చర్చ జరుగుతోంది. ఓపెనర్‌గా కిషన్ బదులుగా జైస్వాల్‌ను ఆడించాలని కొందరు చెప్తున్నారు. అదే సమయంలో తొలి టీ20లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అంత మంది స్పిన్నర్లను ఆడిస్తారా? అనేది ప్రశ్న.
తొలి టీ20లో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు. వీరిలో పటేల్ ఆల్‌రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. మరి రెండో టీ20లో ఒక స్పిన్నర్‌ను తప్పించాలంటే.. చాహల్, కుల్దీప్ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

ఫ్యాన్స్ అందరూ 'కుల్చా' అని పిలుచుకునే ఈ స్పిన్ ద్వయంలో టీంలో కేవలం ఒకరికే చోటు దక్కుతోంది. ఇటీవలి కాలంలో ఇద్దరూ కలిసి ఆడిన మ్యాచులు తక్కువే. ఈ క్రమంలోనే రెండో టీ20లో ఎవరిని పక్కన పెడతారని చర్చ జరుగుతోంది. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా బెస్ట్ బౌలర్ చాహల్ అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో కుల్దీప్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఇలా బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉండటంపై చాహల్ మాట్లాడాడు. జట్టులో కుల్దీప్‌ను తీసుకోవడాన్ని తను అర్థం చేసుకోగలనని చెప్పాడు. 'ఏడో స్థానంలో జడేజా లేదా అక్షర్‌ను ఆడిస్తాం. పిచ్ పూర్తిగా స్పిన్నర్ ఫ్రెండ్లీ అయితేనే ముగ్గురు స్పిన్నర్లు ఆడతారు. కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. తను గొప్ప రిథమ్‌లో ఉన్నాడు' అని చాహల్ కొనియాడాడు.
'కుల్దీప్ అంత మంచి ఫామ్‌లో ఉండబట్టే అతన్ని మేనేజ్‌మెంట్ టీంలోకి తీసుకుంటోంది. నేను నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నా. నాకు ఎప్పుడు అవకాశం దక్కినా రాణించాలని అనుకుంటున్నా' అని చాహల్ చెప్పుకొచ్చాడు. భారత జట్టులో మరీ టెయిలెండర్లు ఎక్కువయ్యారు అనుకున్న ప్రతిసారీ.. చాహల్, కుల్దీప్ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టడం తెలిసిందే.