Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: పొట్టి ఫార్మాట్‌లో ఫెయిల్ అవుతున్న గిల్.. పక్కన పెట్టేయాలా? వద్దా?

విండీస్ టూర్‌లో అనుకున్న స్థాయిలో రాణించని ప్లేయర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. టెస్టులు, వన్డేల్లో కూడా అతను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక టీ20ల్లో అయితే పేలవంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పించేయాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా చేయడం తప్పని కొందరు నిపుణుల వాదన.

రెండు మ్యాచుల ముందే సెంచరీ..
శుభ్‌మన్ గిల్‌ ఈ విండీస్ టూర్‌లో పెద్దగా రాణించని మాట వాస్తవమే. అయితే ఈ రెండు మ్యాచులకు ముందు న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో గిల్ భారీ శతకం చేసిన విషయం మర్చిపోకూడదు. ఈ శతకంతో కివీస్‌పై సిరీస్‌ను భారత్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.

Shubman Gill

ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే.. కొంత కాలం ఇలా ఫామ్ కోల్పోవడం సహజమే. ఇలాంటి సమయంలో అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. అతన్ని పక్కన పెట్టడానికి ముందు మరిన్ని అవకాశాలు ఇవ్వడమే బెటర్ ఆప్షన్.

ఐపీఎల్ రికార్డులు..
ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకోవడంలో గిల్ పాత్ర చాలానే ఉంది. ముఖ్యంగా టోర్నీ చివరి దశలో వరుస సెంచరీలతో గిల్ చెలరేగాడు. లీగ్‌లో ఏకంగా 890 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అంటే గిల్ టీ20 గేమ్‌ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేలా కనిపించాడు.

టాప్ బ్యాటింగ్ స్కిల్స్..
విండీస్‌తో టీ20ల్లో ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన గిల్.. డాట్ బాల్స్ ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే.. అతని బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవని చెప్పొచ్చు. ఆరంభంలో కొన్ని బౌండరీలు సాధిస్తే ఈ ఒత్తిడి ఉండదు.

పేస్, స్పిన్న ఏదైనా అద్భుతంగా ఎదుర్కొనే సత్తా గిల్ సొంతం. వైట్ బాల్ క్రికెట్‌లో అతని ఆటలో లోపాలు దాదాపు లేవనే చెప్పాలి. అతను కచ్చితంగా ఈ ఫార్మాట్‌ను కూడా తన సొంతం చేసుకోవడం గ్యారంటీ అని పలువురు మాజీలు నమ్మకంగా ఉన్నారు కూడా.

Story first published: Tuesday, August 8, 2023, 18:25 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+