Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: ఫ్యూచర్‌పై బీసీసీఐ ఫోకస్.. కోహ్లీ, రోహిత్ స్థానాలు భర్తీ చేసే కుర్రాళ్లు వీళ్లే!

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టులో పలు మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే విండీస్ టూర్‌లో కీలక నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ అనుకుంటోందట. ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ వారసుడు ఎవరంటూ చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రహానే వంటి సీనియర్ల తర్వాత ఎవరు? అని కూడా చర్చ జరుగుతోంది.

పుజారా, కోహ్లీ, రోహిత్, రహానే నలుగురూ కూడా భారత్‌ తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడారు. జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ వీళ్లందరి వయసు కూడా 35 సంవత్సరాల దరిదాపుల్లోనే ఉంది. వీళ్లు అసలు వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతారా? అనేదే అనుమానం. అలాంటిది ఇక భవిష్యత్తు గురించి ఇక ఏం చెప్పగలం? అందుకే కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోందట.

 kohlirohit

ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా రహానే మినహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. తర్వాతి తరం స్టార్లుగా ఎదుగుతున్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా గాయాలపాలై జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో వీరి వర్క్‌లోడ్ మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఉండటం వీరికి కుదరదు.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. వెస్టిండీస్ పర్యటన నుంచే కొత్త వాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలని అనుకుంటోందట. ఈ క్రమంలోనే దేశవాళీల్లో రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ తదితరులను వెస్టిండీస్ పంపాలని డిసైడ్ అయిందట. ఈ మేరకు బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాగైతే భారత జట్టు భవిష్యత్తుపై ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని బీసీసీఐ భావన.

వీరితోపాటు కుర్ర బౌలర్లపై కూడా బీసీసీఐ ఫోకస్ పెడుతోందట. మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ కూడా సీనియర్ బౌలర్లు అయిపోయారు. వీళ్లు కూడా త్వరలోనే రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరికీ గాయాల బెడద ఎక్కువ. ప్రస్తుతం కూడా వీళ్లిద్దరూ గాయాలతోనే ఉన్నారు. అందుకే మంచి పేసర్లను కూడా విండీస్ పంపాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారు.

Story first published: Friday, June 23, 2023, 15:20 [IST]
Other articles published on Jun 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+