Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashwin: ఇదేం బౌలింగ్‌రా అయ్యా?.. అశ్విన్ దెబ్బకు విండీస్ విలవిల.. భారత్ భారీ విజయం!

భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విండీస్‌కు అశ్విన్ పీడకలలా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. అశ్విన్‌తోపాటు జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు.

మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 171 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇక ఓవర్సీస్ సెంచరీ చేస్తాడని ఎంతగానో ఆశించిన విరాట్ కోహ్లీ కేవలం 76 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. లంచ్ వరకు అద్భుతంగా ఆడిన అతను.. లంచ్ బ్రేక్ తర్వాత అవుటయ్యాడు. ఇక చివర్లో జడేజా (37 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు.

Team India registers a massive victory against West Indies

ఈ క్రమంలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 421/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో విండీస్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ ఛేజింగ్‌లో విండీస్‌కు అశ్విన్ పెద్ద తలనొప్పిగా మారాడు. జడేజా బౌలింగ్‌లో టగనరైన్ చందర్‌పాల్ (7) అవుటైన కాసేపటికే కీలకమైన కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ (7)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత కూడా అశ్విన్ వెనక్కు తగ్గలేదు.

క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లే తన తెలివైన బంతులతో పెవిలియన్ చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 21.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 71 పరుగులిచ్చి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో మూడో రోజునే విండీస్ జట్టు 130 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగులతో మ్యాచ్ తన ఖాతాలో వేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టి యశస్వి జైస్వాల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Saturday, July 15, 2023, 7:08 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+