INDvsSL: మూడో టీ20 పిచ్ రిపోర్ట్.. గిల్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని హార్దిక్ ప్లాన్?

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు అనూహ్య ఓటమి చవిచూసింది. ఆసియా ఛాంపియన్స్ శ్రీలంక తమ సత్తా చాటింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచింది. లంక కెప్టెన్ దాసున్ షనక తన ఆల్‌రౌండ్ షోతో జట్టును ముందుండి నడిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసిన అతను.. బౌలింగ్‌లో కూడా రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక గెలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమానంగా నిలిచింది.

సిరీస్‌పై కన్నేసిన లంకేయులు
ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టీ20 కీలకంగా మారింది. టీ20 కెప్టెన్‌గా తొలి ఓటమి చవిచూసిన హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచిన సిరీస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అదే సమయంలో సిరీస్ గెలిచి తాము ఆసియా కప్ గెలవడం అదృష్టం కాదని, తమది సత్తా ఉన్న జట్టని నిరూపించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అంత సులభం కాదు. ఎందుకంటే ఆ జట్టు టాపార్డర్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.

గిల్‌పై టీమిండియా నమ్మకం?
శ్రీలంకతో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌కు పేరొందిన టీమిండియా ఆరంభంలోనే టప టపా వికెట్లు కోల్పోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ ముగ్గురూ కూడా రెండో టీ20లో అనవసరమైన షాట్లు ఆడి పెవిలియన్ చేరారు.
వాళ్లు మరి మూడో టీ20లో ఎలా రాణిస్తారో చూడాలి. వీళ్లపైనే ఈ మ్యాచ్‌లో పూర్తి ఫోకస్ ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే గిల్ వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమవగా.. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే గిల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ టీం మేనేజ్‌మెంట్ మాత్రం ఈ సిరీస్ వరకూ గిల్, కిషన్‌లతోనే ఓపెనింగ్ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

వాతావరణం, పిచ్ ఎవరికి అనుకూలం?
రాజ్‌కోట్‌లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఇక్కడ వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. అయితే సమయం గడిచేకొద్దీ మంచు ప్రభావం పెరుగుతుందని తెలుస్తోంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ జరిగిన మ్యాచులన్నింటిలో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
దీంతో ఈ మ్యాచ్‌లో కూడా పిచ్ పూర్తిగా బ్యాటర్లకు సహకరిస్తుందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు.. రెండో మ్యాచులో చేసినట్లు పొరపాట్లు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications