Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: రెండో టీ20కి ఫుల్ బ్యాటింగ్ పిచ్.. పరుగుల వరద గ్యారంటీ!

INDvsSL second T20I can be a run fest as pitch is batting friendly

శ్రీలంకపై తొలి టీ20లో విజయంతో ఏడాదిని ప్రారంభించిన టీమిండియా.. రెండో మ్యాచులో కూడా విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇక్కడకు చేరుకున్న హార్దిక్ సేన.. ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంజూ శాంసన్ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి వాతావరణం, పిచ్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

వాతావరణం ఎలా ఉంటుందంటే?

వాతావరణం ఎలా ఉంటుందంటే?

పూణేలో కూడా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే అత్యల్పంగా ఇది 25 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వెల్లడించింది. అలాగే వాతావరణంలో తేమ 40 శాతం ఉంటుందని, అంటే మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండదని తేల్చిచెప్పారు. మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని, అభిమానులు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతారని తెలిపారు.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

ఎంసీఏ స్టేడియంలోని పిచ్ ఎక్కువగా బ్యాటర్లకు సహకరించేలా కనిపిస్తోంది. ఏమైనా లభిస్తే స్పిన్నర్లకు కూడా కొంత సహకారం లభించే అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం బ్యాటర్లకే ఈ పిచ్ బాగా కలిసొస్తుంది. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్లు ఎక్కువగా ఛేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ మైదానంలో చివరగా 2020లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. అయితే గతేడాది ఐపీఎల్‌లో మొత్తం 13 మ్యాచులు ఇక్కడ జరిగాయి. వీటిలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 171 పరుగులుగా ఉండటం గమనార్హం.

తొలి మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విన్

తొలి మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విన్

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతికి గెలిచిన ఈ మ్యాచ్.. ప్రేక్షకులకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో లంక బ్యాటర్లను అరంగేట్ర హీరో శివమ్ మావి ముప్పుతిప్పలు పెట్టాడు. ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఆ జట్టు చివరకు 160 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో కేవలం రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Thursday, January 5, 2023, 9:04 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+