Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rahul Dravid: కొత్త టర్మ్‌లో రాహుల్ ద్రావిడ్ ఫోకస్ పెట్టాల్సిన సమస్యలివే..!

టీమిండియా హెడ్ కోచ్‌గా కొత్త వాళ్లకు బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. మంచి ఫలితాలు కనబరిచిన రాహుల్ ద్రావిడ్‌ను ఈ పదవిలో కొనసాగించాలని డిసైడ్ అయింది. దానికి ద్రావిడ్ కూడా ఓకే చెప్పడంతో అతను మరో రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతాడని తేలిపోయింది. ఈ క్రమంలో ద్రావిడ్ ఫోకస్ చేయాల్సిన మూడు ఇష్యూలు ఇవే..

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్:వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆడతారా? లేదా అనే నిర్ణయం ద్రావిడ్ చేతిలోనే ఉంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత వీళ్లిద్దరూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మరి వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో వీళ్లిద్దర్నీ ఆడిస్తారా? అనే టెన్షన్ ఫ్యాన్స్‌లో నెలకొంది. దీనిపై వీళ్లిద్దరితో చర్చించిన తర్వాతనే ద్రావిడ్‌ ఒక నిర్ణయానికి రావలసి ఉంది.

INDvsSA Three issues Rahul Dravid needs to answer in his new tenure

టెస్టుల్లో మార్పులు..:వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరిన భారత జట్టు.. ట్రోఫీ నెగ్గడం మాత్రం వల్ల కాలేదు. అయితే వచ్చే 2023-25 సైకిల్‌లో అయినా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలని భారత్ అనుకుంటోంది. అయితే జట్టులో చాలా మంది ప్లేయర్ల వయసు 35 ఏళ్ల సమీపంలో ఉన్నారు. దీంతో వీళ్ల స్థానంలో కొత్త కుర్రాళ్లను తీసుకొచ్చి, వాళ్లను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి సిరీసులకు రెడీ చేయడంలో కూడా ద్రావిడ్ కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త కుర్రాళ్లు ఇలాంటి కఠినమైన సిరీసుల్లో ఆందోళన లేకుండా ఆడేలా చూడాల్సిన బాధ్యత అతనిదే.

కెప్టెన్సీ కొట్లాట..:ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 ఏళ్లు. దీంతో అతను తర్వాతి వన్డే వరల్డ్ కప్ వరకు జట్టుకు సారధ్య బాధ్యతలు కొనసాగిస్తాడనే నమ్మకం లేదు. ఒక వేళ ఈ ఫార్మాట్‌లో కొనసాగినా మిగతా ఫార్మాట్ల పరిస్థితి ఏంటనేది మరో ప్రశ్న. హార్దిక్ పాండ్యా కెరీర్లో పలుమార్లు గాయాలవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో అతనితోపాటు మరో కొత్త కెప్టెన్‌ను కూడా ముందకు తీసుకురావలసిన అవసరం ఉంది. దీనిపై ద్రావిడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

Story first published: Sunday, December 3, 2023, 16:50 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+