Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSA: బీసీసీఐకి బుర్ర లేదా?.. అతన్ని టీంలో నుంచి ఎలా తీసేశారు?

సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీసుకు కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీసులో కొత్త కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం అందించింది. అయితే ఈ టీం చూస్తూ ముగ్గురు సీనియర్ బ్యాటర్లు ఈ టీంలో మిస్ అయినట్లు కనిపిస్తుంది. వాళ్లే ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్. వీరిలో రహానేను పక్కన పెట్టడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం అర్థం కాలేదు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ధనాధన్ ఆటతో రహానే అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేశారు. ఆ మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో రాణించిన ఏకైక టీమిండియా బ్యాటర్ రహానే. అతన్ని మళ్లీ వైస్ కెప్టెన్‌గా కూడా అప్పుడు బీసీసీఐ నియమించింది.

INDvsSA Fans shocked to see Ajinkya Rahane left out of Test squad

ఇది చూసిన చాలా మంది ఈ నిర్ణయం సరైనదేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసులో రహానే తేలిపోయాడు. పేలవ ఫామ్‌తో బాధ పడిన అతను 3, 8 స్కోర్లు నమోదు చేశాడు. ఇలాంటి సమయంలోనే గాయాల నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

వీళ్లు తిరిగి రావడంతో రహానేను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పుజారాను కూడా అలాగే సైడ్ చేసేశారు. ఇదంతా చూస్తుంటే వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇప్పటి నుంచే జట్టును రెడీ చేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఈ నిర్ణయం పెద్దగా నచ్చలేదు.

రహానే వంటి కీలక ప్లేయర్‌ను పక్కన పెట్టేయడం భారత జట్టుకే నష్టమని, ఫ్యూచర్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం వల్ల చాలా బాధపడాల్సి వస్తుందని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణించిన రహానేను అప్పుడే ఎలా తీసేస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, December 1, 2023, 9:42 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+