Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: సెలెక్ట్ చేసినా.. సంజూను తొక్కేసే ప్లాన్ వేసిన సెలెక్టర్లు?

టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌పై ఎట్టకేలకు సెలెక్టర్లు కనికరించినట్లు కనిపిస్తున్నారు. అతన్ని సౌతాఫ్రికాకు పంపే జట్టుకు ఎంపిక చేశారు. సఫారీలతో మూడు వన్డేలు ఆడే జట్టులో అతనికి కూడా చోటు కల్పించారు. అయితే టీ20లకు అతన్ని ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలెక్టర్లు ప్లాన్లు సంజూకు ఎప్పుడూ నష్టమే కలిగిస్తున్నాయి.

అంతకుముందు సంజూనే కేవలం టీ20లే ఆడించారు. వన్డేల్లో కూడా సంజూ రాణిస్తున్నాడు కదా అని ఎవరైనా అంటే.. టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో సంజూ ఉంటాడని, అందుకే అతను పొట్టి ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టాలనే ఆలోచనతోనే ఇలా చేస్తున్నామని బీసీసీఐ పెద్దలు చెప్పారు. దీంతో సంజూకు పొట్టి ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కుతుందని అంతా సంతోషించారు.

INDvsSA Fans not happy with selecting Sanju Samson for only ODIs

కానీ ఆసీస్ వేదికగా జరిగిన ఈ టోర్నీ దగ్గరయ్యే కొద్దీ సంజూను ఈ ఫార్మాట్‌కు దూరం చేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, సంజూ ఇకపై వన్డేలపైనే ఫోకస్ చేస్తాడని చెప్పుకొచ్చారు. సర్లే పోనీ.. టీ20 వరల్డ్ కప్ కన్నా కూడా వన్డే వరల్డ్ కప్ మనకు ముఖ్యం. సంజూ దానిలో ఆడితే సంతోషమే అని ఫ్యాన్స్ అనుకున్నారు.

ఇక వన్డే వరల్డ్ కప్ దగ్గరయ్యే సమయానికి అసలు టీమిండియా దరిదాపుల్లోనే సంజూ లేకుండా చేశారు. ఇప్పుడు భారత జట్టు వచ్చే పొట్టి ప్రపంచకప్ కోసం రెడీ అవుతుంటే.. సంజూను మాత్రం వన్డేలకు మాత్రమే ఎంపిక చేశారు. మరోసారి టీ20 ఫార్మాట్‌కు సంజూను దూరం చేశారు. ఈ ఫార్మాట్‌లో అయ్యర్ వంటి ప్లేయర్ల కన్నా సంజూ ఎంతో బెటర్. అయినా సరే సెలెక్టర్ల మరోసారి సంజూనే తొక్కేసే ప్లాన్‌తో రెడీ అయ్యారని ఫ్యాన్స్ మండిపడతున్నారు.

సౌతాఫ్రిలో వన్డేలు ఆడే భారత బృందం: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్,

Story first published: Friday, December 1, 2023, 12:44 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+