Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSA: సెలెక్టర్ల కీలక నిర్ణయం.. సఫారీ టూర్‌కు రోహిత్, కోహ్లీ దూరం!

సౌతాఫ్రికాతో టూర్‌కు వెళ్లే జట్టును బీసీసీఐ ఫైనల్ చేసింది. సఫారీ గడ్డపై జరిగే వైట్ బాల్ సిరీసులో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. సౌతాఫ్రికాతో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

న్యూఢిల్లీలో గురువారం నాడు కలిసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా వైట్ బాల్ సిరీసు నుంచి విశ్రాంతి కోరినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో వాళ్లను టీ20, వన్డే సిరీసులకు ఎంపిక చేయలేదని తెలిపింది. అలాగే మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

 INDvsSA BCCI announce Team India squads for South Africa tour

షమీ ఫిట్‌నెస్ సాధిస్తే అతన్ని సఫారీ టూర్‌కు పంపుతామని, లేదంటే అతను ఈ టూర్‌లో ఆడటం జరగదని తెలిపింది. రోహిత్‌తోపాటు గాయంతో బాధ పడుతున్న హార్దిక్ పాండ్యా కూడా ఈ టూర్‌లో ఆడటం లేదు. దీంతో టీ20ల్లో సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించారు. వన్డే సిరీసుకు యుజ్వేంద్ర చాహల్‌, సంజూ శాంసన్ ఇద్దర్నీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక టెస్టు సిరీసులో కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రీఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్టుల్లో జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్

వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్,

టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Thursday, November 30, 2023, 20:50 [IST]
Other articles published on Nov 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+