For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma: పాక్‌పై హిట్టా? ఫట్టా?.. ఆసియా కప్‌లో రోహిత్ రికార్డు ఎలా ఉందంటే?

ఇటీవలి కాలంలో భారత్, పాకిస్తాన్ మూడుసార్లు తలపడగా.. ఈ మ్యాచుల్లో టీమిండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తేలిపోయాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన రోహిత్.. గతేడాది ఆసియా కప్‌లో కూడా పెద్దగా రాణించలేదు. ఈ టోర్నీలో భారత్, పాక్ రెండుసార్లు తలపడ్డాయి. ఈ మ్యాచుల్లో రోహిత్ 12, 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇక గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కూడా రోహిత్ ఫెయిలయ్యాడు. కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇలా వరుసగా విఫలం అవుతున్న రోహిత్.. శనివారం జరిగే మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Rohit Sharma

అయితే పాక్‌పై పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ రికార్డు పరమ చెత్తగా ఉన్న మాట వాస్తవమే. కానీ వన్డేల్లో రోహిత్ చక్కని రికార్డు మెయింటైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆసియా కప్‌లో పాక్‌పై చెలరేగడం రోహిత్‌కు వెన్నతో పెట్టిన విద్య. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరిగినప్పుడు పాక్‌పై రోహిత్ ఏడు మ్యాచులు ఆడాడు. వీటిలో ఏకంగా 73.40 సగటుతో 367 పరుగులు చేశాడు. అంతేకాదు ఒక సెంచరీ కూడా బాదాడు.

కోహ్లీ గైర్హాజరీలో 2018లో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో పాక్‌పై రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 238 పరుగుల ఛేజ్‌లో రోహిత్ (111 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. మరో ఓపెనర్ శికర్ ధవన్ (114) కూడా సెంచరీ బాదాడు. దీంతో ఆ మ్యాచ్‌ను భారత్ ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లలో పాక్‌పై రోహిత్ నాలుగు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

2008లో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. 2012లో మీర్పూర్‌లో 68 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2014లో మరోసారి మీర్పూర్ వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడగా రోహిత్ 56 రన్స్ చేశాడు. చివరగా దుబాయ్ వేదికగా 2018లో జరిగిన మ్యాచ్‌లో కూడా 52 పరుగులతో రాణించాడు. ఓవరాల్‌గా చూసుకున్నా పాక్‌పై రోహిత్ వన్డే రికార్డు బాగానే ఉంది.

మొత్తం 16 సార్లు పాక్‌పై రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచుల్లో 51.42 సగటుతో 720 పరుగులు సాధించాడు. అయితే పొట్టి ఫార్మాట్లో మాత్రం రోహిత్ రికార్డు పరమ చెత్తగా ఉందనే చెప్పాలి. ఈ పార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లలో పాక్‌ను మూడుసార్లు ఎదుర్కొన్న రోహిత్ కేవలం 13.33 సగటుతో 40 పరుగులే చేయగలిగాడు. 2016లో మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

ఇక 2022 ఎడిషన్‌లో రెండుసార్లు పాక్‌తో తలపడగా 12, 28 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా పాక్‌తో రోహిత్ 11 టీ20లు ఆడాడు. వీటిలో అతని రికార్డు చాలా దారుణంగా ఉంది. ఈ 11 మ్యాచుల్లో రోహిత్ 14.25 సగటుతో 114 పరుగలే చేయగలిగాడు. అతని టాప్ స్కోరు కేవలం 30 నాటౌట్ కావడం గమనార్హం.

Story first published: Friday, September 1, 2023, 12:46 [IST]
Other articles published on Sep 1, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+