For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsPAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఈ వైరంపై బాబర్ ఆజమ్ బోల్డ్ కామెంట్స్!

భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీసు జరిగిన పదేళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి కేవలం మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అందుకే ఈ మ్యాచులకు హైప్ కూడా తెగ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో కూడా ఈ రెండు టీమ్స్ ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాయి. రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉండటంతో కచ్చితంగా రెండుసార్లు తలపడటం ఖాయంగా కనిపిస్తోంది.

అదే ఫైనల్ చేరితే రెండు టీమ్స్ మరోసారి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది మాజీలు భారత్, పాక్ వైరంపై రకరకాల కామెంట్స్ చేశారు. కొందరేమో ఇది పెద్ద వైరమే కాదని అంటే.. మరికొందరు మాత్రం ఈ వైరానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడారు. తాజాగా పాక్ సారధి బాబర్ ఆజమ్ ఈ వైరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Babar Azam

సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య వైరం చాలా గొప్పదని, ఫ్యాన్స్‌తోపాటు ఆటగాళ్లు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అలాగే ప్లేయర్లు తమ వంద శాతం ఇచ్చి, గెలిచిన తర్వాత గొప్పలు చెప్పుకునేందుకు ట్రై చేస్తారని అన్నాడు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడినా అది వైరమే అని ఒప్పుకున్నాడు.

'ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ గొప్ప వైరమే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తుంది. మేం కూడా తెగ ఎంజాయ్ చేస్తాం. ఈ మ్యాచుల్లో క్రికెట్ స్థాయి అత్యుత్తమంగా ఉంటుంది. గట్టి పోటీ కనిపిస్తుంది. ఫ్యాన్స్ అందరూ భారత్, పాక్ మ్యాచులను మిస్ అవుతారు. రెండు టీమ్స్ నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడతాయి' అని బాబర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, August 27, 2023, 12:30 [IST]
Other articles published on Aug 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+