ఆగని వర్షం..
ఆ తర్వాత వర్షం తగ్గింది కానీ.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో దాన్ని ఆరబెట్టే పనిలో పడ్డారు సిబ్బంది. భారత జట్టు సభ్యులు కూడా మైదానంలోకి వచ్చి కొంత ప్రాక్టీస్ చేశారు. మరికాసేపట్లో టాస్ వేస్తారనగా మరోసారి వర్షం మొదలైంది. దీంతో అభిమానులు మరింత నిరాశ చెందారు. దీనిపై కామెంటేటర్లు మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూడాలని అనుకున్న అభిమానులకు ఈ వర్షం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు.
మైదానం ఆరడం కష్టం..
న్యూజిల్యాండ్‌లో సాయంత్రం కావడంతో సూర్యుడి ఎండ లేదు. దీంతో మైదానం పొడిబారడం ఆలస్యం అవుతోంది. దీనికితోడు వెల్లింగ్టన్ మైదానం క్రికెట్ గ్రౌండ్ కాదు. ఇది రగ్బీ గ్రౌండ్ కావడంతో డ్రైనేజ్ వ్యవస్థ అంత అద్భుతంగా లేదు. దీని వల్ల గ్రౌండ్ ఆరబెట్టడం ఇంకా లేట్ అవుతోందని కామెంటేటర్లు చెప్తున్నారు. అలాగే వర్షం కూడా మైదానం ఆరే వరకు ఆగడం లేదు. కాసేపటికి ఒకసారి పడుతూనే ఉంది.
భవిష్యత్తుకు ఆరంభం..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున టీ20 ఫార్మాట్‌లో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాగే జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను కూడా ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సరైన జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. న్యూజిల్యాండ్‌లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












