Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsIRE: మూడో మ్యాచ్‌లో టాస్ కీలకం.. వర్షం పడే అవకాశం ఉందా?

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసును మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో చివరిదైన మూడో టీ20లో కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో చివరి మ్యాచ్ అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని మరో పక్క ఐర్లాండ్ పట్టుదలగా ఉంది.

ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు కొంత తడబడింది. అయితే భారత బౌలర్లు రాణించడంతో ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు ఛేజింగ్ మొదలు పెట్టిన కాసేపటికే వర్షం పడింది. ఈ వాన ఎంతసేపకిటీ తగ్గలేదు. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియాను విజేతగా అంపైర్లు ప్రకటించారు.

Team India is getting ready for third T20I. What does weather report says.

ఇక రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చాలా కంఫర్టబుల్‌గా కనిపించారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. సంజూ శాంసన్, రింకూ సింగ్ కూడా ధాటిగా ఆడారు. దీంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం ఐర్లాండ్ ఛేజింగ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆ టీం ఓడిపోయింది.

ఇక బుధవారం జరిగే మూడో మ్యాచ్‌ కూడా డబ్లిన్‌లోనే జరుగుతోంది. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని అంచనా. అయతే మ్యాచ్ జరిగేకొద్దీ పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్ నుంచి బ్యాటింగ్‌కు సహకారం అందడంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక వాతావరణం విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు రండో మ్యాచ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే మూడో మ్యాచ్‌ జరిగే సమయంలో కూడా వర్షం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ ఆసాంతం సాఫీగా సాగిపోతుందని తెలుస్తోంది.

భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయి, ముఖేష్ కుమార్

Story first published: Wednesday, August 23, 2023, 7:49 [IST]
Other articles published on Aug 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+