Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsIRE: జట్టులో చోటే దండగ.. ఈ ముగ్గురు కుర్రాళ్లు అట్టర్‌ఫ్లాప్!

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీసులో భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీసును ఖాతాలో వేసుకుంది. అయితే రెండో మ్యాచ్‌లో కూడా కొందరు టీమిండియా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. వాళ్లెవరంటే..

వాషింగ్టన్ సుందర్: టీమిండియాలో వాషింగ్టన్ సుందర్ ఏమాత్రం ఆశించిన ప్రదర్శన చేయడం లేదు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతను ఈ సిరీసులో కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో సుందర్ పెద్దగా రాణించలేదు.

these three players failed in their departments

రెండో టీ20లో అతను వేసిన రెండు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. పెద్దగా బౌండరీలు ఇవ్వకపోయినా రెండు భారీ వైడ్‌లు వేశాడు. తన కోటాలో కేవలం రెండే డాట్ బాల్స్ వేయగలిగాడు. ఈ పిచ్‌లపై రాణించడం కొంచెం కష్టమే అయినా.. సుందర్ చాలా పేలవమైన ఆటతీరు కూడా ఈ వైఫల్యానికి కారణమే.

శివమ్ దూబే: రెండో టీ20లో శివమ్ దూబేకు టీమిండియా కొంత అన్యాయం చేసిందని చెప్పాలి. స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనే దూబేను చివరి వరకు బ్యాటింగ్‌కు దింపలేదు. చివర్లో పేసర్లు వచ్చాక అతను బరిలో దిగాడు. అప్పటికీ బ్యాటుతో దూబే రాణించాడు. అదే అతను కొంత ముందుగా క్రీజులోకి వచ్చి ఉంటే ఇంకా చెలరేగే వాడే.

ఇక బౌలింగ్‌లో దూబే ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. బంతితో కూడా తన ఇన్నింగ్స బాగానే ఆరంభించిన అతను.. రెండు సిక్సర్లు ఇచ్చిన తర్వాత తడబడ్డాడు. రెండు విభాగాల్లో దూబే నుంచి ఇంకా చాలా ఆశించొచ్చు.

తిలక్ వర్మ: విండీస్ టూర్‌లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ అదిరిపోయే ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. కానీ ఐర్లాండ్ సిరీసులో అతను చాలా ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన అతను.. రెండో మ్యాచ్‌లోనూ పెద్దగా రాణించలేదు.

కేవలం ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. రెండు మ్యాచుల్లోనూ అతను షార్ట్ బాల్‌కే అవుటవడం గమనార్హం. అతని ప్రదర్శన చూసిన వాళ్లంతా.. అసలు తిలక్‌కు ఈ జట్టులో చోటే దండగ అంటున్నారు. ఇదేం తిలక్‌కు కొత్త కాదు.

షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో తిలక్ కొంత కాలంగా తడబడుతూనే ఉన్నాడు. ఆసియా కప్‌కు ఎంపికైన ఆనందంలో అయినా మూడో మ్యాచులో తిలక్ సత్తా చాటుతాడేమో చూడాలి.

Story first published: Monday, August 21, 2023, 17:09 [IST]
Other articles published on Aug 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+