ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఇరుదేశాల ప్లేయర్లు పలు రికార్డులు బద్దలు కొట్టారు. అవేంటంటే..?
బుమ్రాను దాటేసిన అర్షదీప్..
పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అర్షదీప్ సింగ్ రాణించాడు. ఈ ఘనత సాధించడానికి అర్షదీప్‌కు కేవలం 33 మ్యాచులే అవసరమయ్యాయి. దీంతో జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును అర్షదీప్ అధిగమించడం గమనార్హం.

ఇదే రికార్డు కోసం బుమ్రా 41 మ్యాచులు తీసుకున్నాడు. కానీ అర్షదీప్ అంత కన్నా వేగంగా పూర్తి చేయడం విశేషం. డెత్ ఓవర్లలో అంత గొప్పగా బౌలింగ్ చేయకపోయినా కూడా.. అర్షదీప్ తన టీంను ఇంప్రెస్ చేయొచ్చు.
చెత్త రికార్డు..
ఐర్లాండ్ సారధి పాల్ స్టిర్లింగ్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధి సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత్‌పై ఇలా డకౌట్ అవడం పాల్ స్టిర్లింగ్‌కు ఇది 13వ సారి కావడం విశేషం.
ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో 130 మ్యాచులు ఆడిన స్టిర్లింగ్.. ఇలా డౌట్ అవడం పదమూడోసారి కావడం గమనార్హం. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుటైన అతను ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బుమ్రా అరుదైన రికార్డు
పొట్టి ఫార్మాట్‌లో మెయిడెన్ ఓవర్లు వేయడం చాలా అరుదనే సంగతి తెలిసిందే. అయితే ఐ్లర్లాండ్ టీం ఈ మ్యాచ్ గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నించింది. కానీ చివరకు ఓడిపోయింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వేసిన బుమ్రా.. ఆ ఓవర్‌ను వికెట్ మెయిడెన్‌గా ముగించాడు. ఇది బుమ్రా కెరీర్‌లో 10వ మెయిడెన్ ఓవర్ కావడం గమనార్హం. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది.