Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: ఐర్లాండ్‌లో ‘జైలర్’ స్క్రీనింగ్.. ముఖ్యఅతిథిగా సంజూ శాంసన్!

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో టీమిండియా యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే వర్షం పడి మ్యాచ్ రద్దయింది. ఇక రెండో మ్యాచులో తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న అతను 40 పరుగులతో అదరగొట్టాడు.

ఐర్లాండ్‌ గడ్డపై సంజూకు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం గత ఐర్లాండ్ పర్యటనలోనే క్లియర్‌గా అర్ధమైంది. ఇప్పుడు మరోసారి ఇదే విషయం రుజువైంది. ఇక్కడ స్థానికంగా జరిగిన ఒక మెగా ఈవెంట్‌లో సంజూను ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడు. అంతేకాదు, ఈ మీటింగ్‌లో సంజూకు అరుదైన గౌరవం కూడా దక్కింది.

INDvsIRE Sanju Samson attends Jailer screening in Ireland

తమిళ్‌తోపాటు మిగతా భారత భాషల్లో కూడా భారీ విజయం సాధించిన 'జైలర్' చిత్రం స్క్రీనింగ్ జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా సంజూ శాంసన్ హాజరయ్యాడు. ఇక్కడే రజినీకాంత్ మూవీ చూశాడు. ఈ చిత్రం తమిళ సినీ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇలా 'జైలర్' స్క్రీనింగ్‌కు గెస్ట్ ఆఫ్ హానర్‌గా సంజూ హాజరైన విషయం రెండో టీ20 సమయంలో అందరికీ తెలిసొచ్చింది. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, కామెంటేటర్ నీల్ ఓబ్రెయిన్ వెల్లడించాడు. గతంలోనే సంజూ తను రజినీకాంత్‌కు చాలా పెద్ద అభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిదే. గతంలో ఒకసారి రజినీకాంత్‌ను స్వయంగా కలిసిన సంజూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

'చిన్నతనం నుంచే నేను రజినీకాంత్ సూపర్ ఫ్యాన్‌ను. ఏడేళ్ల వయసులో ఎలాగైనా సరే ఎప్పటికైనా రజినీ సార్‌ను కలుస్తానని మా అమ్మానాన్నకు చెప్పా. ఆయన ఇంట్లోనే రజినీని కలుస్తానని అప్పుడు అన్నా. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత తలైవర్ నన్ను తన ఇంటికి ఆహ్వానించడంతో ఆ కల నెరవేరింది' అంటూ రజినీతో ఉన్న ఫొటోను సంజూ కొంతకాలం క్రితం షేర్ చేశాడు.

Story first published: Wednesday, August 23, 2023, 9:32 [IST]
Other articles published on Aug 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+