ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో చివరి మ్యాచ్‌కు టీమిండియా రెడీ అవుతోంది. తొలి రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు.. చివరి మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. తద్వారా మూడు టీ20ల సిరీసును క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌కు షాకివ్వాలని బుమ్రా డిసైడ్ అయ్యాడట.
ఐర్లాండ్ సిరీసులో సంజూ శాంసన్ ఫర్వాలేదు అనిపించాడు. తొలి మ్యాచ్‌లో అతను క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం పడింది. ఇక రెండో మ్యాచ్‌లో భారత టీం భారీ స్కోరు చేయడంలో సంజూ కీలక పాత్ర పోషించాడు. కానీ మూడో టీ20లో మాత్రం అతన్ని పక్కన పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడట.

ఇటీవల ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్‌గా సంజూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్ ముందు తన ట్యాలెంట్ చూపించుకోవడానికి సంజూకు ఇదే చివరి అవకాశం. కానీ అతను అసలు ఈ మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది.
ఐర్లాండ్‌తో మూడో టీ20 ఆడే జట్టులో సంజూ శాంసన్‌ను పక్కన పెట్టేయాలని బుమ్రా అండ్ కో భావిస్తున్నారట. అతని స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ సిరీసులో జితేశ్ శర్మ ఎంపికైనా అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో అతన్ని మూడో టీ20లో ఆడించాలని బుమ్రా భావిస్తున్నట్లు సమచారం.
దీంతో ఆసియా కప్ ముందు సంజూకు చివరగా తన సత్తా నిరూపించుకునే అవకాశం లేకుండా పోయినట్లు అవుతుంది. అలాగే బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ లేదా అర్షదీప్.. ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టేయాలని బుమ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ముఖేష్ కుమార్‌ను ఆడిస్తారట.
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), అర్షదీప్ సింగ్/ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయి, ముఖేష్ కుమార్