Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuzvendra Chahal: ఆసీస్‌తో సిరీసులో హ్యాండిచ్చిన సెలెక్టర్లు.. చాహల్ రియాక్షన్ వైరల్!

వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు దక్కింది.

అదే సమయంలో సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ వంటి వెటరన్ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. చాహల్‌కు ఇటీవలి కాలంలో బీసీసీఐ పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లలో కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ఇక ఈ ఏడాది కూడా చాహల్‌కు సెలెక్టర్లు మొండి చెయ్యే చూపారు.

INDvsAUS Yuvendra Chahal reacts after getting snubbed for T20I series

కేవలం ఒకటీ, అరా సిరీసుల్లో మాత్రమే అతనికి అవకాశం దక్కింది. మిగతా కీలకమైన సిరీసుల్లో చాహల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌లో కూడా చాహల్‌కు చోటు దక్కలేదు. ఇటీవలి కాలంలో కుల్దీప్ యాదవ్ రాణిస్తుండటంతో జట్టు ప్రధాన స్పిన్నర్‌గా అతన్నే సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు.

దీంతో చాహల్‌‌కు జట్టులో చోటు కరువైంది. తాజాగా వన్డే వరల్డ్ కప్‌లో కూడా కుల్దీప్ తర్వాత మరో ఆప్షన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకానీ, చాహల్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక తాజాగా ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీసుకు జట్టును ప్రకటించారు. దీనిలో కూడా చాహల్‌కు చోటు దక్కలేదు.

అయితే దీనిపై చాహల్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా నవ్వుతున్న స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. దానికి ఎలాంటి క్యాప్షన్ జత చేయలేదు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్.. చాహల్‌పై ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఇంత అద్భుతమైన స్పిన్నర్‌ను ఇలా ట్రీట్ చేయడం బీసీసీఐ చేస్తున్న తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Story first published: Tuesday, November 21, 2023, 10:52 [IST]
Other articles published on Nov 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+