Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS ఆసీస్‌ బౌలర్‌కు సైగ చేసిన అంపైర్.. భారత్‌ను ఓడించాలని చూస్తున్నారా?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లు భారత్‌పై కక్ష కట్టినట్లు కనిపిస్తోంది. ఆసీస్ జట్టుకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు ఇస్తున్నారు. ఎలాగైనా ఆసీస్‌ను గెలిపించేందుకు కష్టపడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లకే డ్యూక్ బాల్ షేప్ మారిపోయింది. అలా ఎందుకు జరిగిందని ఎవరూ పట్టించుకోలేదు.

ఇక నాలుగో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ అవుటైన విధానం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. స్కాట్ బోలాడ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు గిల్ ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కామెరూన్ గ్రీన్ వైపు వెళ్లింది. అతను డైవ్ చేసి మరీ దాన్ని ఒంటి చేత్తో అందుకున్నాడు. అయితే ఆ బంతి అతనికి అంత ఈజీగా చిక్కలేదు.

Umpire gives signal to Lyon trying to save a review for Aussies.

ఈ క్రమంలోనే నేలపై ల్యాండయ్యే సమయంలో బంతి అతని చేతి నుంచి దాదాపు జారిపోయింది. వేళ్లతో దాన్ని పట్టుకునేందుకు గ్రీన్ ప్రయత్నించాడు. దీంతో నేలను తాకిన బంతి బౌన్స్ అయ్యి గ్రీన్ చేతిలోకి వచ్చింది. ఈ క్యాచ్ కోసం గ్రీన్ అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్‌కు ఈ నిర్ణయాన్ని పంపగా.. బంతి నేలను తాకిందా? లేదా? అని సరిగా చూడలేదా అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోరో.

ఇలా గిల్ అవుట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అసలు ఈ క్యాచ్ అప్పీల్ చేసిన గ్రీన్‌ను 'చీట్.. చీట్..' అంటూ నిందించారు. ఆ తర్వాత కాసేపటికే మరో షాకింగ్ ఘటన జరిగింది. రహానే బ్యాటింగ్ చేస్తుండగా 38వ ఓవర్ వేయడానికి నాథన్ లియాన్ వచ్చాడు. అతను వేసిన ఒక బంతిని రహానే సరిగా జడ్జ్ చేయలేదు. దీంతో అది అతని ప్యాడ్లను తాకింది.

ఆసీస్ టీం అంతా అప్పీల్ చేసినా అంపైర్ కదల్లేదు. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేసుకునేందుకు 15 సెకన్లు టైం ఉంటుంది. అప్పుడే డీఆర్ఎస్ టైమర్ మొదలవుతుంది. ఒకవేళ ఆసీస్ కనుక ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేస్తే.. వారికి ఒక డీఆర్ఎస్ ఛాన్స్ వేస్ట్ అయ్యేది. కానీ అలా జరగకుండా అంపైర్ ఇల్లింగ్‌వర్త్ హెల్ప్ చేశాడు.

ఎందుకు అది అవుట్ కాదంటూ లియాన్ అడగ్గా.. బంతి బాగా టర్న్ అవుతోందని, లెగ్ స్టంప్‌ను మిస్ అవుతోందని సైగ చేశాడు. ఇలా డీఆర్ఎస్ టైమర్ కూడా మొదలవకముందే అంపైర్ తన సలహాలు ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆసీస్ కనుక ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేసి ఉంటే ఒక రివ్యూ కోల్పోయేదని అంటున్నారు.

ఇలా అంపైర్లు కావాలనే టీమిండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, గిల్ విషయంలో కూడా అంపైర్లు ఆసీస్‌కు మద్దతుగా నిర్ణయాలు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ భారత్ ఓడిపోతే అది అంపైర్ల వల్లనే అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి చివరి రోజున కూడా అంపైర్లు ఇలాంటి కాంట్రవర్సీలకు ఆజ్యం పోస్తారో చూడాలి.

Story first published: Sunday, June 11, 2023, 9:13 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+