ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తాడో పేడో తేల్చుకొని టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకునేందుకు రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లో భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో కనుక రాణించకపోతే ముగ్గురు టీమిండియా ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే. వాళ్లెవరంటే?
ఉమేష్ యాదవ్: మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. దీంతో ఉమేష్ యాదవ్ స్థానం ప్రమాదంలో పడింది. అయితే టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఉమేష్‌కు ఆడే అవకాశం దక్కింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో ఆడిన ఉమేష్ కేవలం మూడు వికెట్లే తీసుకున్నాడు. పేసర్లకు అనుకూలించే ఇంగ్లండ్‌లో కూడా అతను ఫెయిలైతే ఇక బుమ్రా వచ్చాక అతనికి జట్టులో చోటు దక్కడం మరింత కష్టంగా మారుతుంది.
అజింక్య రహానే: విదేశాల్లో భారత్ తరఫున అద్భుతంగా రాణించిన బ్యాటర్లలో రహానే ఒకడు. అయితే గతేడాది జనవరిలో సౌతాఫ్రికా సిరీస్ తర్వాత అతన్ని జట్టులో నుంచి తీసేశారు. వరుసగా విఫలం అవుతున్న అతను మళ్లీ దేశవాళీల్లో తన సత్తా నిరూపించుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ఇరానీ ట్రోఫీల అదరగొట్టిన రహానే.. ఇటీవల ఐపీఎల్‌లో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. అతను కనుక ఈ మ్యాచ్‌లో విఫలమైతే రహానే టీమిండియా కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే అతని స్థానాన్ని భర్తీ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ రెడీగా ఉన్నాడు కదా.
శార్దూల్ ఠాకూర్: ఈ మ్యాచ్ కెరీర్‌కు కీలకమైన మరో ప్లేయర్ శార్దూల్ ఠాకూర్. ఈ ఆల్‌రౌండర్ 2018లో టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ విదేశాల్లో ఆడుతున్న సిరీసులకు మాత్రమే అతన్ని ఎంపిక చేస్తూ రావడంతో ఇప్పటి వరకు కేవలం 8 మ్యాచులే ఆడాడీ ఆల్‌రౌండర్.
డబ్ల్యూటీసీ ఫైనల్ తనకు జీవితంలో ఒకేసారి దక్కే అవకాశం అని శార్దూల్ చెప్పాడు. ఇప్పటి వరకు అతను ఓవల్ స్టేడియంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్‌లో 117 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు రాణిస్తే అతని టెస్టు కీరీర్‌కు కావలసినంత బూస్ట్ దొరుకుతుంది.