పదేళ్లపైగా ఐసీసీ ట్రోఫీ కోసం కలలు కంటున్న భారత జట్టు.. ఆ కల నెరవేర్చుకునేందుకు రెడీ అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌ను ఓడించిన ఆ ట్రోఫీ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటోంది. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రహానే మళ్లీ టీమిండియా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరం అవడంతో అతని స్థానంలో రహానేకు అవకాశం దక్కింది. దేశవాళీల్లో చక్కగా రాణించిన రహానే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా అదరగొట్టాడు. అందుకే అతనికి టీమిండియా నుంచి మళ్లీ పిలుపు దక్కింది.

ఈ క్రమంలోనే టీంమేట్స్ మధ్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న రహానే.. కేక్ కట్ చేశాడు. అయితే అందరూ కలిసి కేక్‌ను రహానే మొఖం నిండా పులిమేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. 'అది పోవాలంటే చాలా కష్టపడి క్లీన్ చేయాలి రహానే' అని ఈ ఫొటోలకు క్యాప్షన్ తగిలించింది.
ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. తాము కూడా బర్త్ డేలు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామని కొందరు చెప్తున్నారు. ఇషాన్ కిషన్, ఛటేశ్వర్ పుజారా వంటి వాళ్లు రహానే మొఖం నిండా కేక్‌తో మేకప్ వేస్తూ ఈ ఫొటోల్లో కనిపించారు. వీటిని ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. బర్త్ డే అంటే ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని అంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా రహానే ఇదే జోరు కొనసాగించి జట్టుకు మంచి స్కోరు అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రహానే ఏదో రిటైర్‌మెంట్ నుంచి తిరిగొచ్చినట్లు ఫీల్ అవుతూ ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ వంటి వాళ్లు అంటున్నారు. మరి రహానే ఎలా ఆడతాడో చూడాలి.