Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటాం.. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుస్తాం అంటున్న గిల్!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుసగా రెండోసారి చేరిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఉంది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ కూడా అదే చెప్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా గిల్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 17 మ్యాచుల్లో ఏకంగా 890 పరుగులతో అదరగొట్టాడు.

ఇప్పుడు సడెన్‌గా టీ20 ఫార్మాట్ నుంచి ఆటను టెస్టులకు మార్చుకోవడం గురించి గిల్ మాట్లాడాడు. ఇలా ఆటను అడ్జస్ట్ చేసుకోవడం ఫన్‌గా ఉంటుందని, అదే సమయంలో ఛాలెంజింగ్‌గా కూడా ఉంటుందని చెప్పాడు. ఐపీఎల్‌లో రాణించడం కాన్ఫిడెన్స్‌ ఇస్తుందని, కానీ టెస్టులు వేరే డిఫరెంట్ బాల్ అని అన్నాడు. ఇంగ్లండ్‌లో పరిస్థితులు కూడా సవాల్ విసురుతాయని తెలిపాడు.

Shubman Gill

'ఐపీఎల్ ప్రదర్శన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్ ఆట. అయిదే అదే దీనిలో ఉండే ఫన్ అదే. వారం క్రితం మేం డిఫరెంట్ ఆట ఆడుతూ ఉన్నాం. అక్కడి వాతావరణం కూడా వేరు. ఇప్పుడు అంతా భిన్నంగా ఉంది. టెస్టు క్రికెట్‌లో అదే ఎగ్జయిటింగ్ కలిగించే అంశం' అని గిల్ చెప్పాడు.

చివరగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని గుర్తుచేసుకున్న గిల్.. అదే విషయాన్ని చెప్పాడు. తమ జట్టు కూడా దీని గురించి చర్చించుకుందని అన్నాడు. అప్పుడు చేసిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నాడు.

'ఆ మ్యాచ్‌లో ఆడటం ద్వారా మా బ్యాటింగ్ గ్రూప్‌గా మేం చాలా నేర్చుకున్నాం. దాని గురించే టీం అంతా మాట్లాడుకున్నాం. అప్పుడు చేసిన పొరపాట్లు అధిగమిస్తామని ఆశిస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో గిల్ కూడా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. అయితే ఇప్పుడు క్రికెటర్‌గా చాలా మెచ్యూర్‌ అయిన గిల్ ఈ మ్యాచ్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Story first published: Tuesday, June 6, 2023, 16:16 [IST]
Other articles published on Jun 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+