Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS ఎంత టార్గెట్ అయినా.. ఛేజ్ చేసేస్తాం: శార్దూల్ ఠాకూర్

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు తడబడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు బంతితో సరైన ఆరంభం దక్కలేదు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా టీమిండియ టాపార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. ఇలాంటి సమయంలో జట్టును రహానే, శార్దూల్ ఆదుకున్నారు.

వాళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ గురించి మాట్లాడిన శార్దూల్.. భారత్ గెలవడం దాదాపు ఖాయమని అన్నాడు. ఎందుకు? టెస్టు క్రికెట్‌లో విజేత ఎవరు? అని అప్పుడే చెప్పలేమని శార్దూల్ చెప్పాడు. ఒక గంటలోనే టెస్టు మ్యాచ్ విజేత ఎవరో మారిపోతుందని తెలిపాడు.

Shardul Thakur

'క్రికెట్ ఫన్నీ గేమ్. ఒక మ్యాచ్‌లో ఏది గెలిచే టోటల్ అని చెప్పలేం. అదే ఐసీసీ టోర్నీ ఫైనల్ అయితే అసలు చెప్పలేం. ఒక మంచి భాగస్వామ్యం దొరికితే చాలు 450 పరుగుల టార్గెట్ ఉన్నా ఛేజ్ చేసేయొచ్చు. గతేడాది ఇంగ్లండ్ దాదాపు 400 టార్గెట్‌ను ఛేజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇంగ్లండ్ టీం పెద్దగా వికెట్లు కూడా కోల్పోలేదు. అది మాకు కచ్చితంగా పాజిటివ్ అంశమే' అని శార్దూల్ చెప్పాడు.

'ఆస్ట్రేలియా మా ముందు ఎలాంటి టార్గెట్ ఉంచినా సరే.. గెలిచేది ఎవరని అంచనా వేయడానికి ఇది సరైన టైం కాదు. చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం.. టెస్టుల్లో ఒక్క గంట మ్యాచ్‌లో ఫలితం మారిపోతుంటుంది. కాబట్టి మేం కూడా అదే ఆశావాదంతో ఉంటాం. గెలవాలనే ఉద్దేశ్యంతోనే ఆడతాం' అని తెలిపాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే, శార్దూల్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. మరి రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ ఎలా ఆడుతుందో చూడాలి.

Story first published: Sunday, June 11, 2023, 7:09 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+