టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఏకంగా మూడు శతకాలు బాదిన అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. చాలా నిలకడగా ఆడుతూ ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టాడీ యంగ్ ఓపెనర్. ఈ ఏడాది ఆరంభంలో భారత్ తరఫున కూడా చెలరేగాడు.
ఈ ఫామ్‌తోనే ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌కు చాలా కీలకం కానున్నాడు. ఈ క్రమంలో గిల్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లు అందరికీ ఇది చాలా ఎగ్జయిటింగ్ గేమ్. ఇక్కడకు చేరుకోవడానికి చాలా కష్టపడ్డాం. రెండేళ్ల పాటు చాలా టెస్టు సిరీసులు ఆడి, ఫలితాలు మనకు అనుకూలంగా వస్తే ఇక్కడకు చేరుకున్నాం' అని చెప్పాడు.

ఈ మ్యాచ్ ఆడే అవకాశం చాలా కష్టపడి సాధించామని, ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్ చాలా స్పెషల్. అలాగే చాలా ముఖ్యం కూడా అని ద్రావిడ్ అన్నాడు. 'శుభ్‌మన్ గిల్ ఎప్పటి నుంచో స్టార్ ప్లేయరే. తను అండర్-19 ఆడుతున్నప్పటి నుంచి చూస్తున్నా. తను అప్పటి నుంచి క్లాస్ ప్లేయరే. అండర్-19 వరల్డ్ కప్ ఆడే సమయంలోనే అతను చాలా స్పెషల్ ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది గుర్తించారు' అని కొనియాడాడు.
'గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టుతో కొన్నేళ్లుగా కొనసాగుతున్నాడు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో తన కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనికి అన్నీ ఇప్పుడు కలిసొస్తున్నాయి. మధ్యలో గాయాలపాలైన అతను ఇబ్బంది పడ్డాడు. కానీ గత రెండేళ్లలో అన్నీ కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు గిల్ కూడా కొంత అనుభవం సంపాదించాడు. మరింత కంఫర్టబుల్‌గా ఉన్నాడు' అని చెప్పాడీ లెజెండరీ కోచ్.
అంతర్జాతీయ స్థాయిలో తను రాణించగలననే కాన్ఫిడెన్స్ గిల్‌లో కనిపిస్తోందని, అద్భుతమైన ఆటగాడిగా అతను ఎదిగాడని ద్రావిడ్ మెచ్చుకున్నాడు. టీమిండియా వెటరన్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు జోడీగా గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయం. మరి ఈ మ్యాచ్‌లో అతను ఎలా రాణిస్తాడో చూడాలి.