INDvsAUS భరత్ బ్యాటింగ్‌పై నమ్మకం లేదంటున్న లెజెండ్.. కిషన్‌నే ఆడించాలట!
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడే జట్టులో ఒక సమస్య పెద్ద చర్చలకు దారి తీసింది. అదే వికెట్ కీపర్ ఎంపిక. టీమిండియా వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఎవరిని తీసుకోవాలని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ తన అభిప్రాయం చెప్పాడు.
ఇంతకుముందు ఈ రెండు జట్లు తలపడిన చివరి నాలుగు మ్యాచుల్లో కేఎస్ భరత్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా భరత్‌నే ఆడించాలని చాలా మంది అంటున్నారు. అయితే కిషన్‌ను ఆడిస్తే బాగుంటుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించాడు. తనైతే ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తానని అన్నాడు.

'భరత్ కన్నా ముందు ఇషాన్ కిషన్‌ను సెలెక్ట్ చేయాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే కిషన్ వల్ల భారత బ్యాటింగ్ మరింత బలంగా ఉంటుంది. భరత్ కన్నా కూడా బెటర్‌గా కొత్త బంతిని ఎదుర్కోగలడు. తను ఓపెనర్ కూడా కదా. మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అంటే 80 ఓవర్ల తర్వాత ఇషాన్ వచ్చినా ఓపెనర్ కాబట్టి రాణిస్తాడు' అని చెప్పాడు.
'రిషభ్ పంత్ మంచి ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్. ఇషాన్ కిషన్ కూడా అదే క్వాలిటీ ఉన్న ఆటగాడు. వికెట్ల వెనుక భరత్ అద్భుతమైన ఆటగాడే.. కానీ అతని బ్యాటింగ్‌పై నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు' అని హర్భజన్ అన్నాడు. అయితే మిగతా నిపుణులు మాత్రం ముందుగా భరత్‌కే అవకాశం దక్కుతుందని అంటున్నారు.
ఐపీఎల్‌లో కిషన్ మంచి ఫామ్ కనబరిచిన మాట వాస్తవమే.. అయితే భరత్‌కు అసలు ఈ టోర్నీలో ఆడే అవకాశమే దక్కలేదు. అయితే అంతకుముందు టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం భరత్‌కు ఉంది. కానీ ఇషాన్ కిషన్ ఇటీవలి కాలంలో రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. అయితే అతను దేశవాళీల్లో రాణించాడు. కాబట్టి అతన్ని ఆడించినా మంచిదే అని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications