Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS ఆసీస్‌ను భారత్ ఓడిస్తే చూడాలనుంది: ఇంగ్లండ్ దిగ్గజం

డబ్ల్యూటీసీ ఫైనల్ మరికొన్ని గంటల్లో మొదలవుతుంది. చాలా కష్టపడి వరుసగా రెండోసారి ఈ స్థాయికి చేరిన టీమిండియా ఎలాగైనా ఈసారి ట్రోఫీ నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇంగ్లండ్‌కు చెందిన వాడినని, కానీ భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

భారత జట్టు గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో ఇబ్బంది పడుతోందని చెప్ిపన అతను.. 'భారత జట్టులో కూడా కొందరు సూపర్ పేసర్లు ఉన్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం. కానీ ఇక ఇంగ్లిష్ మ్యాన్‌గా నా అంచనా భారత్ గెలవాలని. ఆస్ట్రేలియాను టీమిండియా ఓడిస్తే చూడాలని ఆశపడుతున్నా' అని చెప్పాడు.

INDvsAUS WTC Final Former legend wants to see India beat Australia at Oval

ఈ మ్యాచ్ జరిగే ఓవల్ పిచ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పూర్తిగా పచ్చగా ఉన్న పిచ్‌ను ఈ మ్యాచ్‌ కోసం తయారు చేశారు. ఇంత పేసర్ ఫ్రెండ్లీ పిచ్‌పై ఆసీస్, భారత్ రెండు జట్లలోని పేసర్లు బౌలింగ్ చేయడానికి తెగ సంతోషిస్తారు. ఈ క్రమంలోనే అశ్విన్‌ను పక్కన పెట్టేసి నలుగురు సీమర్లతో భారత్ బరిలో దిగుతుందని వార్తలు వస్తున్నాయి.

దీని గురించి మాట్లాడిన స్వాన్.. భారత్ వద్ద కూడా అద్భుతమైన పేస్ విభాగం ఉందన్నాడు. 'ఓవల్‌లో బౌలింగ్ చేయడంలో బెస్ట్ విషయం అక్కడ లభించే బౌన్స్. ఇది ఆల్‌మోస్ట్ వాంఖడేలోని ఎర్రమట్టి పిచ్‌లా ఉంటుంది. సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్‌లో ఉండే ఫీల్డర్లను ముందుకు తీసుకొస్తే.. స్పిన్నర్లు కూడా రాణిస్తారు' అని చెప్పాడు.

చివరి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే స్పిన్నర్లను ఆడించాలని, స్పిన్ బౌలింగ్ చేయడానికి కూడా ఇది చాలా మంచి పిచ్ అని స్వాన్ అభిప్రాయపడ్డాడు. మరి భారత జట్టు ముందుగా అనుకున్నట్లు ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతుందా? లేక జడేజా ఒక్కడితోనే సరిపెట్టుకుంటుందా? అనేది చూడాలి.

Story first published: Wednesday, June 7, 2023, 7:50 [IST]
Other articles published on Jun 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+