వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు భారత జట్టు ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన వాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ ముందు ఏకంగా 444 పరుగుల టార్గెట్ నిలిచింది. దీన్ని ఛేదించడం అంత ఈజీ కాదు.
ఇలాంటి సమయంలో అంపైరింగ్ తప్పిదాల వల్ల భారత ఆటగాళ్లు నష్టపోయారు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాంట్రవర్షియల్ నిర్ణయానికి అవుటయ్యాడు. ఇది కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. అదే క్రమంలో రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా ఇద్దరూ పరమ చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది.

ఇలాంటి సమయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వెటరన్ అజింక్య రహానే పోరాడుతున్నారు. కుడి చేతి చూపుడు వేలు వాచి, నొప్పిగా ఉన్నా కూడా రహానే నిలకడగా రాణిస్తున్నాడు. కోహ్లీ కూడా మంచి టచ్‌లో ఉన్నట్లే ఉన్నాడు. దీంతో భారత జట్టు గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ అది అంత సులభం కాదు.
ఎందుకంటే భారత జట్టు ఇప్పటి వరకు ఛేజ్ అత్యంత భారీ స్కోరు కేవలం 403 పరుగులు. అది కూడా 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై. ఆ తర్వాత మళ్లీ అంత స్కోరును భారత్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. చివరగా 2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 387 పరుగులను భారత్ ఛేజ్ చేసింది.
ఆ తర్వాత భారత్ ఎప్పుడూ ఇంత భారీ స్కోరును ఛేజ్ చేయలేదు. ఇక ప్రపంచ క్రికెట్‌లో చూసుకున్నా కూడా 444 పరుగుల టార్గెట్‌ను ఎవరూ ఛేజ్ చేయలేదు. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 418 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. అదే ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధికం.
ఇప్పుడు కనుక భారత జట్టు 444 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తే టెస్టు క్రికెట్ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుంది. అయితే ఇటీవల టెస్టు క్రికెట్ చాలా మారిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ 'బాజ్‌బాల్' పోకడ అన్ని జట్లకు స్ఫూర్తినిస్తోంది. ఈ క్రమంలో కోహ్లీ, రహానే కనుక ధాటిగా ఆడి భారత్‌ను గెలిపిస్తే టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించడం గ్యారంటీ.