For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS ఇలాగైతే వరల్డ్ కప్ ఎలా గెలుస్తాం?.. సీనియర్ ప్లేయర్లపై మండిపడ్డ లెజెండ్!

అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తూ దాదాపు అన్ని ఐసీసీ టోర్నీల్లో ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న టీమిండియా.. ట్రోఫీ నెగ్గి మాత్రం దశాబ్దం దాటిపోయింది. గెలిచే మ్యాచుల్లో స్వయం తప్పిదాలతో ఓడిపోవడం భారత్‌కు అవాటుగా మారింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా అదే జరిగింది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే పొరపాట్లు చేసి అవుటయ్యారు

ఈ ప్లేయర్లు అందరూ చెత్త షాట్లు ఆడటం వల్లనే పెవిలియ్ చేరారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ వీళ్లపై మండిపడ్డాడు. తప్పులు చేసి అవుటైన ఈ అనుభవం ఉన్న ప్లేయర్లు ఎవరూ సాకులు చెప్పకూడదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయాల్లోనే చాలా కఠినంగా ఉండాలని, ఆరంభం నుంచి జట్టు అప్రోచ్ ఏంటో నిలదీయాలని చెప్పాడు.

INDvsAUS WTC Final 2023 We will not win any ICC trophy with this slams Legend

'ప్రారంభం నుంచి మీ అప్రోచ్ బాగలేదని నిజాయితీగా చెప్పేయాలి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ స్థాయికి తగ్గట్లే మీ అప్రోచ్ ఉందా? జట్టు ఎంపిక, టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలా లేక బ్యాటింగ్ ఎంచుకోవాలా? అనే విషయాల్లో మీరు మరీ కన్జర్వేటివ్‌గా ప్రవర్తించారా? ఇలా ప్రతి విషయంలో జట్టు అప్రోచ్ ఎలా ఉందో చాలా కఠినంగా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి' అని గవాస్కర్ అన్నాడు.

వెటరన్ ప్లేయర్లు కదా అని ఆడిస్తుంటే, అలాంటి సీనియర్లే వరుసగా విఫలం అవుతుండటంపై కూడా గవాస్కర్ మండిపడ్డాడు. దీని కన్నా కూడా కొత్త వాళ్లను సెలెక్ట్ చేయాలని, వాళ్లు ఫెయిలైనా ఇంత బాధ ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పెద్ద వేదికపై ఒకే తరహా ప్లేయర్లను ఎంపిక చేయడం, వాళ్లు ఫెయిలవడం ఎంత కాలం చూస్తాం? అని ప్రశ్నించాడు.

'ఇంత అనుభవం ఉన్న వాళ్లు కుంటి సాకులు చెప్పకూడదు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతనొక్కడే షాట్లు ఆడకుండా అవుటయ్యాడు. అలా అనగానే అతను కూడా షాట్లు ఆడాల్సింది అని కొందరంటారు. కానీ అతను కరెక్ట్‌గా టెస్టు మ్యాచ్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంతిని వదిలేయబోయి బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి కొంచెం బౌన్స్ అవడంతో అవుటయ్యాడు' అని చెప్పుకొచ్చాడు.

'కాబట్టి కుంటి సాకులు చెప్పకండి. నిజాయితీగా, ఫ్రాంక్‌గా ఉండటం మంచిది. మీరు తప్పులు చేశారనే నిజాన్ని గుర్తించండి. ఇలాంటి తప్పులు చేసినందుకు సీనియర్లకు పనిష్‌మెంట్ ఇవ్వాలంటే ఇవ్వండి' అని చెప్పాడు. టీమిండియా కనుక ఇదే పద్ధతిని అనుసరిస్తే.. మహా అయితే ఆసియా కప్ గెలుస్తుందని, అంతేకానీ ఐసీసీ టోర్నీ గెలవడం మాత్రం అసాధ్యమని తేల్చిచెప్పాడు.

Story first published: Monday, June 12, 2023, 7:35 [IST]
Other articles published on Jun 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+