INDvsAUS జట్టును గెలిపించగలను అనే నమ్మకంతోనే నిద్ర లేస్తా: విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కీలకంగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో పెవిలియన్ చేరిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో చక్కగా ఆడుతున్నాడు. రోహిత్, పుజారా చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరడంతో జట్టును గట్టున పడేసే బాధ్యతను తీసుకున్నాడు.
అతనికి అజింక్య రహానే మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరిపైనే భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో తన ఆట గురించి కోహ్లీ మాట్లాడాడు. భారత్‌కు ఆడటం తనకు అతి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాడు. తన జట్టును గెలిపించే అవకాశం దక్కడం తనను మరింత మోటివేట్ చేస్తుందని తెలిపాడు.

'భారత్ తరఫున ఆడే ప్రతి మ్యాచ్‌లో నా జట్టును గెలిపించే అవకాశం దక్కడనం నన్ను మోటివేట్ చేస్తుంది. క్రీడల్లో అంతకన్నా గొప్ప మోటివేషన్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఏ మ్యాచ్ ఆడుతున్నా సరే.. జట్టును నేనే గెలిపించగలను అనే గట్టి నమ్మకంతోనే ఉదయం నిద్రలేస్తాను' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టీంమేట్స్ టెన్షన్ పడకుండా చేయడమే తన లక్ష్యం అని కోహ్లీ అన్నాడు. 'నేను క్రీజులో ఉన్నంత వరకు టీం సభ్యులు టెన్షన్ పడకుండా.. నేను గెలిపిస్తానని నమ్మాలని అనుకుంటా. నేను బ్యాటింగ్ చేసేప్పుడు జట్టుకు హెల్ప్ చేస్తున్నాననే ఆలోచన నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. నేను గెలిపించగలననే నమ్మకంతో టీం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటా' అని వెల్లడించాడు.
'నేను ఎప్పుడూ ఆ విషయంలో గర్వపడతా. అదే సమయంలో నా నుంచి జట్టు అది ఎక్స్‌పెక్ట్ చేసే స్థానంలో ఉండటం చాలా గౌరవంగా భావిస్తా. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు.. నా టీంను గెలిపించగల వాడిని నేనే అనే నమ్మకంతో లేస్తా' అని పేర్కొన్నాడు. మరి డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా కోహ్లీ గెలిపిస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications