Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS గిల్ అవుట్ చూసి.. రోహిత్ ఇచ్చిన రియాక్షన్ వైరల్!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు భారత జట్టు ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన వాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ ముందు ఏకంగా 444 పరుగుల టార్గెట్ నిలిచింది. దీన్ని ఛేదించడం అంత ఈజీ కాదు.

ఇలాంటి సమయంలో అంపైరింగ్ తప్పిదాల వల్ల భారత ఆటగాళ్లు నష్టపోయారు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాంట్రవర్షియల్ నిర్ణయానికి అవుటయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. ఆ షాట్ సెలెక్షన్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్ వైపు వెళ్లింది.

rohit sharma gill catch

అతను తన ఎడం చేతి వైపు డైవ్ చేసి మునివేళ్లతో బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బంతి నేలను తాకింది. ఆసీస్ టీం అవుట్ కోసం అప్పీల్ చేసింది. థర్డ్ అంపైర్ ఈ క్యాచ్‌ను కాసేపు పట్టి పట్టి చూశాడు. చివరకు బంతి క్లియర్‌గా కనిపించడం లేదని చెప్పి, గిల్‌ను అవుట్ ఇచ్చేశాడు. ఇది చూసిన అందరూ షాకైపోయారు.

ఆ సమయంలో గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కూడా ఈ నిర్ణయం చూసి నోరెళ్లబెట్టాడు. అతను బాధ, కోపం, చిరాకుతో ఊగిపోయాడు. ఈ సమయంలో రోహిత్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతి అభిమాని బాధను రోహిత్ చూపించేశాడని చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఇక శుభ్‌మన్ గిల్ కూడా తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఆశ్చర్యం, బాధతో దిగ్భ్రాంతి చెందాడు. అతను అలా ఏమీ అర్థంకానట్లు చూసిన దృశ్యం కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఏదేమైనా ఈ అవుట్‌ను మాత్రం భారత క్రీడాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరనేది మాత్రం వాస్తవం.

Story first published: Sunday, June 11, 2023, 11:30 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+