For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS నాలుగో రోజు ఆట ముగిశాక కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. బుర్ర చించుకుంటున్న ఫ్యాన్స్!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు భారత జట్టు ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన వాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ ముందు ఏకంగా 444 పరుగుల టార్గెట్ నిలిచింది. దీన్ని ఛేదించడం అంత ఈజీ కాదు.

ఇలాంటి సమయంలో అంపైరింగ్ తప్పిదాల వల్ల భారత ఆటగాళ్లు నష్టపోయారు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాంట్రవర్షియల్ నిర్ణయానికి అవుటయ్యాడు. ఆ తర్వాత చెత్త షాట్లు ఆడి రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా కూడా పెవిలియన్ చేరారు. వాళ్లు ఇలాంటి షాట్లు ఆడి అవుట్ అవుతారని ఫ్యాన్స్ ఎవరూ ఊహించలేదు.

Virat Kohli shares a cryptic post

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఇద్దరూ భారత్‌కు అండగా నిలిచారు. బలమైన డిఫెన్స్‌తో ఆసీస్‌కు మరో వికెట్ దక్కుండా నాలుగో రోజు ఆటను ముగించారు. అదే సమయంలో ఓవర్‌కు 4కు తగ్గకుండా పరుగులు చేసి కొండంత లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించే ప్రయత్నం కూడా చేశారు.

వాళ్ల ప్రయత్నాలతోనే నాలుగో రోజు ఆటను భారత జట్టు 164/3తో ముగించింది. రహానే చక్కగా ఆడతుండగా.. విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపించాడు. ఇక ఐదో రోజును వీళ్లిద్దరూ ఎలా ఆరంభిస్తారనే దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దీంతో వీళ్లిద్దరూ ఎలా ఆడతారని ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇంత టెన్షన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో ఒక క్రిప్టిక్ పోస్టు పెట్టాడు. 'మనకు వర్రీలు, అనుమానాలు, భయాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అన్నీ వదిలేయడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి' అనే కొటేషన్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌కు ఏమీ అర్ధం కాలేదు.

Virat Kohli shares a cryptic post

కొంపతీసి డబ్ల్యూటీసీ ట్రోఫీ వదిలేయాలని అంటున్నావా? అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మరికొందరేమో ఇంత టెన్షన్‌లో ఇంకా టెన్షన్ పెంచే పోస్టులు ఎందుకు బాస్? అని నిలదీస్తున్నారు. ఈ కోట్ షేర్ చేయడం వెనుక కోహ్లీ ఆలోచన ఏంటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

Story first published: Sunday, June 11, 2023, 11:17 [IST]
Other articles published on Jun 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+